గత కొన్ని నెలలుగా దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ గురించి విసృత స్థాయిలో చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ పరిశోధనల నుంచి ప్రచారంలోకి వస్తున్న విషయాల్లో కొన్ని వాస్తవాలు కాగా మరికొన్ని అవాస్తవాలు కూడా ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. 
 
200 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలించాని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. అయితే గాలి ద్వారా వైరస్ వ్యాప్తి గురించి, ఇతర విషయాల గురించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టతనిచ్చింది. రెస్టారెంట్లు, వ్యాయమ తరగతులు నిర్వహించే ప్రదేశాల్లో మాత్రమే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 
 
రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులతో ఇండోర్ ప్రదేశాల్లో సన్నిహితంగా మెలిగితే వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు లక్షణాలు లేని వ్యక్తుల నుంచి కరోనా వ్యాప్తి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
లక్షణాలు లేని వాళ్ల నుంచి కరోనా సోకుతుందని... అయితే ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని డబ్ల్యూ.హెచ్.వో స్పష్టం చేసింది. లక్షణాలు లేని వారి నుంచి వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో ఇంకా తేలాల్సి ఉందని పేర్కొంది. వైరస్ సోకిన వ్యక్తులు దగ్గినా, తుమ్మినా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.     

మరింత సమాచారం తెలుసుకోండి: