మామూలుగా ఏదైనా సమస్య వస్తే.. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తాము. అయితే  సమస్య తీర్చమని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులే మరో సమస్యగా మారితే  పరిస్థితి ఎలా ఉంటుంది. తాజాగా జరిగిన ఘటన ఇలాంటిదే. ఇక్కడ కామంతో ఊగిపోయిన ఒక సిఐ ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన యువతుల నంబర్లు  సేకరించి ప్రేమ పాటలు చెప్పటం మొదలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో... ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలు నెంబర్ తీసుకుని... వారికి వివిధ కారణాలతో బెదిరించి మరి రాసలీలకు తెరలేపాడు.



ఎంతో గౌరవప్రదమైన బాధ్యత  గల పోలీసు వృత్తిలో కొనసాగుతూనే... మన్మధ లీలలకు తెర లేపాడు పోలీస్ అధికారి. ఈ కామ సిఐ  మన్మథ లీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. దీంతో అధికారులు అతనిపై కఠిన  చర్యలు తీసుకున్నారు. చెన్నై లోని తిరుచ్చి   జిల్లాలో సిరవణురు పోలీస్ స్టేషన్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది.  పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న మణివణ్ణన్... పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలు యువతుల నెంబర్లు తీసుకుని.. రాత్రులు విచారణ పేరిట ఫోన్ చేసి మాట్లాడటం... ఆ తర్వాత వారితో మాటలు కలిపి  పరిచయం పెంచుకుని ప్రేమ పాటలు చెప్పడం... మొదలెట్టాడు.



ఈ క్రమంలోనే ఓ యువతి ని లోబరుచుకునేందుకు సిఐ మణివణ్ణన్ ప్రయత్నించగా.. చివరికి యువతి డిఐజి పిర్యాదు చేయటంతో ఆ సిఐ మన్మధ లీలలు బయటఒడ్డాయి. దీంతో మణివణ్ణన్  ఉద్యోగ విరమణకు 5 ఏళ్ళు ముందుగానే మణివణ్ణన్ పదవి విరమణ బలవంతంగా చేయించారు అధికారులు. ఇటీవలే డిఐజి బదిలీ కావటంతో తన ఉద్యోగానికి డోక లేదనుకున్న మణివణ్ణన్ స్టేషన్ కీ వచ్చాడు. కానీ షాక్... కొత్తగా వచ్చిన డిఐజి కూడా మణివణ్ణన్ కీ  రిటైర్ మెంట్  ఉత్తర్వులు జారీ చేసారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: