చింతమనేని ప్రభాకర్....టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. వివాదాస్పద నేత కూడా. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు ఉంటాయి. 2009లో దెందులూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని, 2014లో అదే స్థానం నుంచి మరోసారి అదిరిపోయే విజయం అందుకున్నారు. అయితే ఇక్కడ నుంచి చింతమనేని హైలైట్ అవుతూ వచ్చారు. పైగా అధికారంలో ఉండటంతో, చింతమనేని ఆధిపత్యం కొనసాగింది.

 

దెందులూరులో ఈయన ఎంత అంటే అంతా అన్నట్లుగా నడిచింది. ఈ క్రమంలోనే తహశీల్దార్ వనజాక్షితో గొడవ జరగడంతో, చింతమనేని బాగా నెగిటివ్ అయ్యారు. ఆ తర్వాత ఎస్సీలని దూషించారనే వివాదం, ఇంకా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లని తిట్టడం..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వివాదాల్లో చింతమనేని చిక్కుకున్నారు. అయితే వివాదాల్లోనే కాదు, నియోజకవర్గంలో పనిచేయడంలో కూడా చింతమనేని ముందే ఉన్నారు.

 

ఆ ఐదేళ్లు చింతమనేని బాగానే పనిచేశారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించారు. అభివృద్ధి కూడా బాగానే జరిగింది. కానీ వీటి అన్నిటికి కంటే వివాదాలే హైలైట్ కావడంతో, 2019 ఎన్నికల్లో చింతమనేని, వైసీపీ అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరీ చేతిలో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరీ కాస్త వెనుకబడి ఉన్నారని, పనితీరు విషయంలో అబ్బయ్య మీద చింతమనేని బెటర్ అనే ఫీలింగ్ దెందులూరు ప్రజల్లో వచ్చినట్లు తెలుస్తోంది.

 

పైగా ప్రతిపక్షంలో ఉన్నాక చింతమేనేని దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఇంకా తన ఇంటి వద్ద ఉన్న జనతా క్యాంటీన్‌లో నిత్యం పేదలకు భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఇక చింతమనేని మీద కొన్ని కేసులు రావడంతో, పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఇలా అరెస్ట్ కావడంతోనే చింతమనేని మీద సానుభూతి పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఏడాదిలో చింతమనేని బాగానే పుంజుకున్నట్లు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: