ఏదైనా వింత జరిగినప్పుడు అందరూ కలికాలం అనుకుంటూ సరి పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ కలికాలం కాదు కరోనా కాలం అంటూ ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితిని తిట్టుకుంటూనే భయంభయంగా, భారంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కరోనా వైరస్ కు ప్రస్తుతం పూర్తి స్థాయిలో వాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గుంపులు గుంపులుగా గుమిగూడడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనాను అదుపు చేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. జనాలు కూడా ఈ జాగ్రత్తలు బాగానే అలవాటు పడ్డారు. అవసరమైతే తప్ప జనాలు ఎవరూ రోడ్లపైకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. గతంలో వలే హంగులు, ఆర్భాటాలకు, విచ్చలవిడితనానికి ఎవరూ వెళ్లకుండా, ఎవరి ఇంటి వ్యవహారాలు వారే చూసుకుంటూ, విందులు, వినోదాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.

 

IHG' - The ...

 

కొంత కాలం పాటు జాగ్రత్తలు తీసుకుంటే, ఈ వైరస్ బారి నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. జనాలంతా ఈ తరహా జీవన విధానానికి అలవాటుపడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆకస్మాత్తుగా వెల్లడించిన నిజాన్ని ఇప్పుడు జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనలో వెల్లడైందని, ప్రముఖ వైద్యులు కొంతమంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కు లేఖ రాయడం, తమ అధ్యయనాలను వారికి అందించడంతో, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా, గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని బయటపెట్టింది. కాకపోతే దీనిపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఇంటా, బయటా ఉండాలని స్పష్టం చేసింది. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే చోట సంచరించాలి అని,  ఇరుకు ప్రాంతాల్లో ఉంటే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, అలాగే వైరస్ గాలిలో సుమారు ఎనిమిది గంటలపాటు ఉంటుంది అని చెప్పడంతో అందరిలోనూ కంగారు మొదలైంది.

IHG

పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషెంట్ లకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది. గాలి ద్వారా కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో జనాలు మరింత అప్రమత్తతో లేకపోతే, ఈ కరోనా కాటుకు గురికాక తప్పదనే విషయాన్ని మొహమాటంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టడంతో ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు నెలకొన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: