కామాంధులు ఈ మద్య తెగ రెచ్చిపోతున్నారు.. ముఖ్యంగా ఆడవారి బలహీనతలు ఆసరాగ చేసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారుతున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ మేనేజర్ తన కింద పనిచేసే ఉద్యోగినిపై కన్నేశాడు. మ‌రో సహోద్యోగితో కలిసి ఆ ఉద్యోగినిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధిస్తూ లొంగకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

 

ఆ ఇద్దరు ఉన్నతాధికారులు సుమారు ఆరు నెలలుగా కోరిక తీర్చాలంటూ వెంట పడుతున్నా ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆమె డ్యూటీ ఎక్కే సమయంలో యూనిఫామ్ మార్చుకుంటుండగా జనరల్ మేనేజర్ ఆ గదిలోకి వచ్చాడు. ఆ సమయానికి అర్ధనగ్నంగా ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించగా, బాధితురాలు తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత తన కోరిక తీర్చి ఉంటే ప్రమోషన్ వచ్చి ఉండేదని.. కోరిక తీర్చనందుకు ఆమెపై తిట్లదండకం అందుకున్నాడు మేనేజర్. ఈ క్రమంలో... తమ కోరిక తీర్చడం లేదని ఆమెపై కక్షగట్టిన ఆ మేనేజర్లు.  

 

ఆమెను లొంగదీసుకునేందుకు పలురకాలుగా లైంగికంగా వేధించారు. అయినా ఆమె మాత్రం ససేమిరా అనడంతో ఇక బెదిరింపులకు దిగారు ఇద్దరు దుర్మార్గులు.   ఆ మహిళను మూడు రోజుల క్రితం ఎటువంటి నోటీసూ లేకుండానే ఉద్యోగం నుంచి తొలగించారు.  దీంతో బాధితురాలు గురువారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  కేసు దర్యాప్తులో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: