ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్ళాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే లో 36,401 వద్ద కనిష్ట స్థాయికి చేరుకొని, చివరికి మార్కెట్ సమయం ముగిసే సమయానికి 143 పాయింట్ల నష్టంతో 36,594 వద్ద ముగిసింది. ఇక ఇదే మాదిరి నిఫ్టీ కూడా 10713 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరుకోగా రోజు ముగిసేసరికి 46 పాయింట్ల నష్టంతో 10768 వద్ద ముగిసింది.

IHG

ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలో నడవగా దాంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రయత్నం చేశారు. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడ మార్కెట్లు నష్టాల్లో బాట పడటంతో ఆ ఎఫెక్ట్ మిగతా మార్కెట్లపై కూడా పడుతున్నాయి.  ఇక నేడు స్టాక్ మార్కెట్ లోని నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... రిలయన్స్, సన్ ఫార్మా, హెచ్సిఎల్, బ్రిటానియా, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లు లాభాల వైపు నడిచాయి. ఇక ఇందులో రిలయన్స్ దాదాపు మూడు శాతం వరకు లాభపడి 1878 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, గెయిల్, హెచ్డిఎఫ్సి షేర్లు నష్టాలు బాట నడిచాయి. 

 

IHG

ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే 27 పైసలు లాభపడి 75. 39 వద్ద కొనసాగుతోంది. అలాగే ముడి చమురు ధరలు కూడా స్వల్పంగా నష్టపోయాయి. ఇక నగదు వ్యవహారంలో గురువారం నాడు విదేశీ ఇన్వెస్టర్లు 213 కోట్లను ఇన్వెస్ట్ చేయగా దేశీయ ఇన్వెస్టర్లు 803 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: