మార్చి నెల తొలి వారంలో దేశంలో కరోనా వైరస్ విజృంభించింది. మొదట్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అనంతరం రోజురోజుకు వైరస్ వ్యాప్తి చెందడంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ లాక్ డౌన్ ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొదట్లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా ఢిల్లీ జమాత్ సదస్సుల తర్వాత అమాంతం కేసులు పెరిగాయి. 
 
అనంతరం ఏపీ, తెలంగాణ సీఎంలు మీడియాతో మాట్లాడుతూ పారసిటమాల్ కరోనాను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కరోనాను పారాసిటమాల్ తగ్గిస్తుందని చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ నేడు ఆ విమర్శలు చేసిన వాళ్లు తెలుసుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. జగన్, కేసీఆర్ పారాసిటమాల్ గురించి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అసత్యం లేదని నేడు నిరూపితమవుతోంది. 
 
నిజానికి కరోనా సోకినా భయపడల్సిన అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స చేయించుకుని రోగనిరోదక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే త్వరగానే కోలుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రభుత్వాలు కరోనా రోగులకు వాడుతున్న మందుల జాబితా విడుదల చేయగా అందులో పారాసిటమాల్ ఉంది. ఇవి కాక రోగి లక్షణాలను బట్టి రోగులకు మందులను ఇస్తున్నారు. కొందరు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా నేటికీ సీఎంలపై విమర్శలు చేస్తున్నారు. 
 
ఇప్పుడు పారాసిటమాల్ వల్ల అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ టాబ్లెట్ల విషయంలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు విషయాన్ని వదిలేసి కొసరు విషయాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. బెడ్ల కొరత, ఇతర ఇబ్బందుల వల్ల ప్రతిపక్షాలు పడుతున్న ఇబ్బందులు అన్నీన్నీ కావు. ప్రతిపక్షాలు అవి ప్రశ్నించడం మానేసి నేటికీ పారాసిటమాల్ పేరుతో విమర్శలు చేయడంతో ప్రజల్లో గౌరవం కోల్పోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: