ఈ మద్య టెక్నాలజీ పెరిగే కొద్ది విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సింది పోయి.. కొంత మంది ఘోరాలకు తెగబడుతున్నారు.   తాజాగా తమాషాగా చేసిన పని ఓ యువకుడి నిండు ప్రాణం బలి తీసుకుంది.  నలుగురు స్నేహితులు ఫన్నీగా డ్యాన్సులు చేస్తున్నారు. అందులో ఒక యువకుడు చీర కట్టుకొని డ్యాన్స్ చేశాడు..దాన్ని వీడియో తీశారు మిగతా స్నేహితులు.  ఆ వీడియోను డిలీట్ చేయ‌మ‌ని అడిగినందుకు యువ‌కుడిని క‌త్తితో పొడిచి చంపారు.

 

 

ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలోని ధార‌వి స్ల‌మ్ ఏరియాలో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.  ధార‌విలోని సుభాష్ న‌గ‌ర్ కు చెందిన కౌశిక్ సునీల్ నారాయ‌ణ్ క‌ర్(17) అనే యువ‌కుడు.. త‌న ఇంట్లో చీర ధ‌రించి డ్యాన్స్ చేశాడు. యువ‌కుడి డ్యాన్స్ ను అదే కాల‌నీకి చెందిన మ‌రో న‌లుగురు యువ‌కులు ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ విషయం కాస్త కౌశిక్ కి తెలియడంతో తన పరువు పోతుందని.. దయచేసి ఆ వీడియో డిలీట్ చేయాలని స్నేహితులను కోరాడు. వారు వినకుండా వెక్కిరించడం చేశారు. దాంతో కోపంతో కౌశిక్.. పోలీసులకు లేదా త‌న అంకుల్ కు చెప్తాన‌ని హెచ్చ‌రించాడు.

 

 కౌశిక్ మామ స్థానికంగా పోలిటీషన్.. మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒకవేళ తమ గురించి మామకు చెబితే ఇబ్బంది ఉంటుందని.. కోపంతో ఊగిపోయారు స్నేహితులు. కౌశిక్ మామ ఇంటికి వెళ్లగా.. అతను లేక‌పోవ‌డంతో ఇంటికి తిరిగొస్తున్న క్ర‌మంలో మార్గ‌మ‌ధ్య‌లో మాటు వేసిన న‌లుగురు యువ‌కులు క‌త్తితో కౌశిక్ పై పొడిచారు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ కౌశిక్ క‌న్నుమూశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న వెంటనే పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ న‌లుగురిలో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు.  మైన‌ర్ల‌ను డొంగ్రి రిమాండ్ హోమ్ కు త‌ర‌లించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: