విశాఖ రాజధాని కావాలన్నది జగన్ ఆకాంక్ష. ఆ దిశగా ఆయన చాలానే అడుగులు వేశారు. అయితే ఎప్పటికపుడు కొత్త సమస్యలు చిక్కులు వస్తున్నాయి. పెద్దల సభలో అధికార వికేంద్రీకరణ బిల్లు పాస్ కాలేదు. మరో వైపు చూస్తే కరోనా మహమ్మారి గుమ్మం ముందే ఉంది. ఇక కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో విశాఖ రాజధాని సాకారం అవుతుందా అన్న డౌట్లు అధికార పార్టీలోనే ఉన్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంచితే విశాఖ రాజధాని విషయమంలో ముందుకు పోవాలనే జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ విషయంలో ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయానికి వచ్చారని కూడా చెబుతున్నారు. రాజధాని అంశం ఎంత కాలం నానబెడితే అంతకాలం ఏపీ అభివ్రుధ్ధి కూడా కుంటుపడుతుందని జగన్ భావిస్తున్నారుట.

 

ఇక కరోనా మహమ్మారిలా రెచ్చిపోతోంది తప్ప ఏ మాత్రం తగ్గడంలేదు. దాంతో రాజధాని విషయంలో ఇక దూకుడు  ఆలోచనా చేయల్సిందేనని జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ నేల 15న మంత్రివర్గం సమావేశం అవుతుందని అంటున్నారు. ఈ సమావేశం కీలక అంశాలన్నీ చర్చిస్తుందని  తెలుస్తోంది. అందులో అతి కీలకమైన రాజధాని అంశం కూడా ఉందని అంటున్నారు.

 

అంటే విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయలన్న దాని మీద జగన్ మంత్రులతో మాట్లాడుతారని, తన మనసులో మాటను చెబుతారని అంటున్నారు. అప్పటికి మరో రెండు రోజుల తరువాత అంటే ఈ నెల 17 నాటికి శాసనమండలికి రెండవ మారు పంపించిన బిల్లు కూడా గడువు పూర్తి అవుతుందని, దాన్ని గవర్నర్ కి పంపించి విశాఖ పాలనా రాజధానిగా చట్టం తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే విశాఖకు రాజధాని సాధ్యమైనంత తొందరగానే తరలివెళ్లడం తధ్యమని వైసీపీ వర్గాల భోగట్టా. దానికి తగిన ముహూర్తాలు కూడ రెడీగా ఉన్నాయట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: