కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ.. కరోనా ముందు బలాదూరే అని మరోసారి రుజువైంది. ఈసారి ఏకంగా ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడిన ఘటన తమిళనాట కలకలం రేపుతోంది. తమిళనాడులో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. 

 

IHG


ఇప్పటికే తమిళనాడులో కరోనాతో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మృత్యువాత పడ్డారు. రోజూ చెన్నైలో 3, 4 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఇప్పుడు సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన్ను చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

 

IHG

 

తమిళనాడులో ఇప్పటికే విద్యుత్‌ శాఖ మంత్రి పి. తంగమణి, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. అన్బళగన్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ కొత్త లెక్కతో తమిళనాడులో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది.

 

IHG

ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. జార్ఖండ్‌లో ఇప్పటికే ఏకంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: