దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కశ్మీర్ లోని కొంత భాగం పాక్ వశమైంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తరువాత పరిస్థితులు మారినా కశ్మీర్ లోయ విషయంలో మాత్రం పరిస్థితులు ఇంకా చక్కబడాల్సి ఉంది. కశ్మీర్ లోయ ప్రాంతంలో వేర్పాటువాదులు తమ నాటకాలను కొనసాగిస్తూ అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆ ప్రాంతంలో భూములు అమ్మకుండా బెదిరింపులకు పాల్పడటం, మన దేశ జెండా పట్టుకున్న వాళ్లను హింసించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
 
ఈ అరాచకాలు చేసే గ్యాంగుల ఆటలు నేటికీ సాగుతున్నాయి. అక్కడి ప్రజలు కూడా ఈ అరాచకాలను భరించలేక తిరబడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రాంతంలో కేంద్రం చాలా సంవత్సరాల నుండి నివశిస్తున్న వాళ్లకు శాశ్వత నివాస పత్రాలను మంజూరు చేస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే ఇక్కడ మాజీ సైనికులకు, గూర్ఖాలకు ప్రభుత్వం అక్కడ పౌరసత్వం కల్పించనుందని తెలుస్తోంది. 
 
మొత్తంగా 8 లక్షల మందికి కేంద్రం నివాస యోగ్యత పత్రాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఈ 8లక్షల మంది హిమాలయాలు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారని...ఈశాన్య రాష్ట్రాలలో రిటైరైన సైనికులకు సైతం నివాస పత్రాలు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుందని తెలుస్తోంది. నివాస పత్రలు ఇవ్వడం ద్వారా అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. 
 
అక్కడకు ఉగ్రవాదులు వచ్చినా, దాడులు చేసే గ్యాంగులు వచ్చిన కర్రకు కర్ర, కత్తికి కత్తి అనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎత్తు వేసిందని తెలుస్తోంది. కశ్మీర్ కు భవిష్యత్తులో సైతం ఇబ్బందులు ఎదురు కాకుండా కేంద్రం శాశ్వత ప్రణాళికలు రచిస్తోంది. ఉగ్రవాదులు, ఉగ్రమూకలకు కూడా ఈ నిర్ణయాల ద్వారా కేంద్రం షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: