ఏలూరి సాంబశివరావు...కొన్నిరోజుల క్రితం బాగా రాష్ట్ర రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయిన నేత. టీడీపీకి వీర విధేయుడుగా ఉండే ఏలూరి...వైసీపీ వైపు వెళుతున్నారని వార్తలు వచ్చాయి. వార్తలకు తగ్గట్టుగానే ఏలూరి కూడా సైలెంట్ కావడంతో, పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో చంద్రబాబు, ఏలూరితో మాట్లాడి రాష్ట్ర స్థాయి పదవితో పాటు నెక్స్ట్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిసింది.

 

దాంతో ఏలూరి నెక్స్ట్ బయటకొచ్చి, టీడీపీని వీడటం లేదని చెప్పేసి, తన పని తాను చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం పర్చూరులో ఏలూరి ఉన్నారు కాబట్టి, టీడీపీ ఫుల్ బలంతో ఉంది. కానీ అధికారంలో ఉండి కూడా ఇక్కడ వైసీపీ వీక్‌గా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరి మీద ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

 

దీంతో ఇక్కడ వైసీపీని రావి రామనాథం బాబు నడిపిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు దక్కలేదని చెప్పి రావి, టీడీపీలోకి వెళ్ళి ఏలూరి విజయానికి కృషి చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇటు వచ్చేశారు. ప్రస్తుతానికి పర్చూరులో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు రామనాథం బాబు చూసుకుంటున్నారు. అయితే పర్చూరు ఆయన గ్రిప్ లోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

 

ఎందుకంటే పర్చూరులో టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో పాటు, గత ఐదేళ్లు ఏలూరి చేసిన అభివృద్ధితో పర్చూరులో ఊహించని మార్పులు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏలూరి బాగానే పనిచేస్తున్నారు. సొంత ఖర్చులతో సైతం పనులు చేయిస్తున్నారు. పైగా దగ్గుబాటి వైసీపీకు దూరం జరిగాక, ఆయన ఫాలోవర్స్ సైతం వైసీపీకి దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ ఇంకా వీక్ అయినట్లు కనిపిస్తోంది.

 

అయితే సడన్‌గా ఏలూరి ఏమన్నా టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలోకి వస్తే తప్ప పర్చూరులో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి. అలా కాకుండా ఏలూరి టీడీపీలోనే కొనసాగితే పర్చూరులో వైసీపీకి కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: