టీడీపీ ఘోరంగా ఓడిపోయి ఏడాది దాటుతుంది. ఈ ఏడాది కాలంలో టీడీపీ నేతలు ఇంకా పుంజుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల హవానే నడుస్తోంది. దీంతో టీడీపీ నేతలు వీక్‌గానే కనిపిస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సరైన పనితీరు కనబర్చకపోవడం వల్ల టీడీపీ నేతలకు అడ్వాంటేజ్‌గా మారింది. పైగా టీడీపీ నేతలు దూకుడుగా పనిచేసి ఏడాది సమయంలోనే నియోజకవర్గాల్లో పరిస్థితులని అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

 

అలా 2019 ఎన్నికల్లో ఓడిపోయాక, ఏడాది సమయంలోనే కాస్త పుంజుకున్న నేతల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఉంటారు. నాలుగుసార్లు వరుసగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, గత చంద్రబాబు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమా...2019 ఎన్నికల్లో మైలవరంలో వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. సుమారు 12 వేల మెజారిటీ తేడాతో ఉమా తొలిసారి ఓటమి రుచిచూశారు.

 

అయితే ఓడిపోయాక మిగిలిన టీడీపీ నేతలు సైలెంట్ అయినట్లు ఉమా సైలెంట్ కాలేదు. ఓటమి నుంచి వెంటనే కోలుకుని నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. నిత్యం ఏదొక సమస్య మీద గళం విప్పుతూనే ఉన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతిరోజూ పోరాటం చేస్తూనే ఉన్నారు. అసలు ఎప్పుడు మీడియా సమావేశాలు పెట్టడం, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. అటు అధినేత చంద్రబాబుకు అండగా ఉంటూ, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

 

ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో దేవినేని ఉమా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమరావతి రైతులకు ఎప్పుడు అండగానే ఉంటున్నారు. ఇక ఇటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఏదో జగన్ అందించే ప్రభుత్వ పథకాలు ఒక్కటే ఇక్కడ వైసీపీకి ప్లస్ అవుతున్నాయి. కానీ ఉమా పుంజుకోవడం, పైగా అమరావతి ఉద్యమం ఎఫెక్ట్ మైలవరం ప్రజలపై ఎక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలు అమరావతినే రాజధానిగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటే భవిష్యత్‌లో ఇక్కడ వైసీపీకి కాస్త కష్టకాలం నడిచేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: