జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లాల పునర్విభజన అంశంపై అనేక చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలని విభజించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా ఈ జిల్లాల విభజనలో జగన్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుబోతుందని ప్రచారం జరుగుతుంది.

 

రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి, జిల్లాలు కూడా 25 కానున్నాయని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంతో పాటు అదనంగా అనకాపల్లి జిల్లా రానుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గిరిజన నియోజకవర్గాలు కలిసి  అరకు జిల్లాగా ఏర్పడనుంది. ఇక తూర్పు గోదావరి జిల్లా మూడుగా చీలి... రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా ఏర్పడనుంది. పశ్చిమగోదావరి జిల్లా రెండుగా చీలి... ఏలూరు…నర్సాపురం జిల్లాలుగానూ, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు, గుంటూరు నుంచి అదనంగా బాపట్ల…నర్సారావుపేట జిల్లాలు, చిత్తూరు నుంచి అదనంగా తిరుపతి, కడప నుంచి అదనంగా రాజంపేట, కర్నూలు నుంచి అదనంగా నంధ్యాల, అనంతపురం నుంచి అదనంగా హిందూపురం జిల్లాలు ఏర్పడనున్నాయి.

 

అయితే ఇలా పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలు ఏర్పడితే ఇబ్బందులు వస్తాయని అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలోని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. అసలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లా విభజన చేయొద్దు అంటున్నారు. తాజాగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దీనిపై స్పందిస్తూ.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల విభజన సాగాలని సూచించారు. అంటే పార్లమెంట్‌ వారీగా విభజన చేస్తే చిక్కులు వస్తాయనే విధంగా ధర్మాన మాట్లాడారు.

 

ఇక దీనిపై టీడీపీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన సరికాదని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, అప్పుడు జిల్లాలని మారుస్తారా అని ప్రశ్నించారు. అయితే పెద్ద జిల్లాలని విభజించి నెల్లూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలని అలాగే ఉంచాలని కోరారు. మరి చూడాలి జిల్లాల విభజనలో రోజుకో అంశం తెరపైకి వస్తుండటంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: