హడావిడి ఎక్కువ...అసలు మేటర్ తక్కువ...ఇదే ఏపీలో బీజేపీ పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో చాలా వీక్‌గా ఉందనే సంగతి తెలిసిందే. అసలు ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో ఒక శాతం కూడా ఓట్లు రాలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఒకశాతం ఓట్లు రాకపోయినా సరే ఆ పార్టీ చేసే హడావిడి మామూలుగా ఉండదు.

 

ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి, ఏమన్నా కేసులతో ఇబ్బందులు పడాలేమో అని చెప్పి చాలామంది టీడీపీ నేతలు బీజేపీలోకి వచ్చేశారు. ఇక అలా టీడీపీ నేతలు రావడంతో తమ బలం పెరిగిపోయిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేస్తామని, అధికారంలోకి వచ్చేస్తామని హడావిడి చేస్తున్నారు.

 

ఇక అధికారంలోకి వచ్చేస్తామో అని భ్రమలో ఉన్న బీజేపీ నేతలు...ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలనే మట్టికరిపించామని, వైసీపీ పెద్ద లెక్క కాదు అన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల ముందు హడావిడి చేసిన చంద్రబాబు పరిస్థితి ఏమైందో గుర్తుపెట్టుకోవాలని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తున్నారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించబోతోందని, నెక్స్ట్ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నారు. అయితే వాస్తవానికి చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి....జగన్‌కు చెక్ పెట్టే అవకాశం ఏ మాత్రం లేదు. 2019 ఎన్నికల ముందు అంటే బాబు చేసిన తప్పులే టీడీపీ కొంపముంచాయి. దానికితోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..బాబుకు అన్నిరకాల దారులు మూసేసింది.

 

దీంతో బాబు ఘోరంగా ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది జగన్...ఆయనకు ప్రజల సపోర్ట్ ఫుల్ గా ఉంది. ఇక ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం జగన్‌ని టచ్ చేయడం బీజేపీ వల్ల కాదు. కాబట్టి ఏదో బీజేపీ ఆర్భాటం తప్పితే, ఏపీలో జగన్‌ని దించే సత్తా ఆ పార్టీకి ఏ మాత్రం లేదు. అసలు ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో బీజేపీ 5 శాతం ఓట్లు తెచ్చుకుంటే గ్రేటే.

మరింత సమాచారం తెలుసుకోండి: