మరోసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టి సచివాలయాన్ని కూల్చివేయడం పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాస్తు నమ్మకంతో కేసీఆర్ సచివాలయం కూల్చివేయడం మంచిది కాదంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆకాంక్షతో కేసీఆర్ ఈ సచివాలయం కూల్చివేతకు సిద్ధమయ్యారని రేవంత్ విమర్శలు చేశారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ వందలాది కోట్ల రూపాయలను ఈ విధంగా వృధా చేస్తున్నారని మండిపడ్డారు. 
 
IHG
 
అసలు ఈ కూల్చివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా ? అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా కూల్చివేతకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. అలాగే ప్రస్తుత సచివాలయం కూల్చిన బిల్డింగుల గార్బేజ్ ను ఎక్కడ పడేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సచివాలయం లో ఉండే చర్చి, మసీద్, నల్ల పోచమ్మ గుడి లను కూల్చివేయడం పై ఆయన మండిపడ్డారు. ఈ గుడులను కూల్చి వేయడం ద్వారా, ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.16 మంది ముఖ్యమంత్రులను పాలించిన సెక్రెటరీయెట్ ఇప్పుడు కూల్చివేయడం దారుణమని అన్నారు. 
 
సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ లకు సీఎం కేసీఆర్ రాత్రికి రాత్రి పడగొట్టాలని ఆదేశించారని, రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని ఆ పరిసర ప్రాంతాల్లో కి వెళ్ళకుండా చేశారని  మండిపడ్డారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు సమీపంలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది సరైంది కాదని రేవంత్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: