కరోనా వైరస్ వచ్చిన స్టార్టింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అన్ని మీడియా సమావేశాలు.. దేశంలో మరే ముఖ్యమంత్రి నిర్వహించలేదు. చాలా ధీమాగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటా అన్నట్టు అహంకారపూరితంగా కేసీఆర్ మాటలు అప్పట్లో ఉన్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ లో కేసిఆర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అనేది చాలా చిన్న వైరస్ అధ్యక్ష… 30 డిగ్రీలు ఉష్ణోగ్రత కలిగిన తెలంగాణ రాష్ట్రంలో అది రావటం అనేది అసంభవం అని చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా గాని మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మాస్కులు లేకుండా ప్రజల తరఫున కరోనా వైరస్ తో పోరాడుతాం అంటూ చాలా ధీమాగా కేసీఆర్ అప్పట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మంత్రులకు ఎమ్మెల్యేలకు పోలీసులకు అదేవిధంగా కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా కరోనా ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం నుండి కొద్ది సాయం కూడా రాని పరిస్థితి ఏర్పడింది. చాలామంది కరోనా బాధితులు హాస్పిటల్స్ లో తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అసలు బాగోలేదు అని సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది ప్రభుత్వాన్ని సంప్రదించడం వల్ల లాభం లేదని ఏకంగా తెలంగాణ గవర్నర్ ని ఆశ్రయిస్తున్నారు.

 

పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ ఇప్పుడు కరోనా విషయంలో ఎవరికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని తెలంగాణ వాసులు మండిపడుతున్నారు. అసలు టెస్టింగ్ లు లేవు పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అంటే భయంకరంగా ఫీజులు ప్రజల నుండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేసిఆర్ జాడ అసలు కనబడకపోవడం తెలంగాణలో ప్రజలు తెరాస పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: