ఇప్పుడు అంద‌రి ఆలోచ‌న‌, భ‌యం అంతా క‌రోనా గురించే. ఈఓ వైపు ఈ మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఈ వ్యాధి గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌రోనా వ్యాధిగ్ర‌స్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ సోకుతుందని ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ మొదటగా పేర్కొనగా ఇటీవల గాలి, తుంపర్ల ద్వారా సైతం వైరస్‌ వ్యాప్తి చెందుతుందని పలువురు వైద్య నిపుణులు వాదించగా ఆరోగ్య సంస్థ సైతం ఇది నిజమేనని చెప్పకనే చెప్పేసింది. డబ్ల్యూహెచ్‌వో సైతం మూడు దశల్లో దాదాపు పదిహేను రకాల లక్షణాలను ప్రకటించింది. ఈ క్రమంలోపలువురు నిపుణులు రకరకాల మార్గాల ద్వారా వైరస్‌ విజృంభిస్తున్నదని తెలుపుతున్నారు. దీంతో ఏది నిజం.. ఎవరిని నమ్మాలి.. ఏవి పాటించాలి అంటూ ప్రజలు గందరగోళ ప‌డుతున్నారు. 

 

వైరస్‌ పుట్టుక, లక్షణాలు స్పష్టంగా నిర్ధారణ కాకపోవటంతో రోగి లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. ఇప్పటికీ ఈ వైరస్‌ ఎలా పుడుతున్నది.. ఎలా వ్యాప్తి చెందుతుందనేది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. ఇదే క్రమంలో వైరస్‌ విస్తరణ ప్రారంభమైన మూడు నెలల తర్వాత గాలి ద్వారా సైతం కరోనా సోకవచ్చునని పలువురు నిపుణులు తెలుపుతుండటంతో ప్రజలకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతున్నది. వైరస్‌ శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుందనే చేదు నిజం తాజాగా బయటపడింది. ముఖ్యంగా మెదడు, వెన్నుపూస రెండింటికీ ఎఫెక్ట్‌ ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడంలో వైద్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైరస్‌ను కట్టడిచేసే క్రమంలో చేసిన ప్రయత్నాలుగానే స్పష్టమవుతున్నది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైరస్‌ గాలిలో పుట్టి గాలి ద్వారానే విస్తరిస్తున్నదని ఒక అవగాహనకు రావడంతో మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఎందుకంటే, అంతిమంగా ప్ర‌భావితం అయ్యేది మ‌న ఆరోగ్యాలే, పోయేది మ‌న ప్రాణాలే కాబ‌ట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: