చైనా భారత్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చైనా గత ఐదు రోజుల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటోంది. చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినా డ్రాగన్ కు శత్రు దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికా ఇప్పటికే చైనా విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా నిర్లక్ష్యం వల్లే ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందిందని భావిస్తోంది. 
 
చైనాపై అమెరికా కోపం రోజురోజుకు పెరుగుతోంది. చైనాపై అమెరికాకు కోపం పెరగడానికి కరోనాతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా చైనాతో అమెరికాకు అతిపెద్ద ముప్పు ఉందని కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ కృష్ణ ఫర్ రే నివేదిక ఇచ్చారు. చైనా ప్రభుత్వం అమెరికాలో గూఢచర్యం చేస్తోందని... డేటా దొంగలిస్తోందని.... చైనా చేస్తున్న ఈ రెండు పనుల వల్ల చైనాకు ముప్పు ఉందని ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ పేర్కొన్నారు. 
 
చైన సైలెంట్ గా విదేశాల్లో ఆపరేషన్లు నిర్వహిస్తోందని.... ఇతర దేశాల్లోని చైనా పౌరులను టార్గెట్ చేయడం మొదలుపెట్టిందని ఎఫ్.బీ.ఐ పేర్కొంది. అమెరికా కరోనాపై చేస్తున్న పరిశోధనలను చైనా బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని.... చైనా ప్రపంచంలోనే నంబర్ 1 దేశం అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అమెరికా ప్రస్తుతం చైనా కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. 
 
ప్రతి పది గంటలకు అమెరికాలో చైనాకు సంబంధించిన నిఘా కేసు నమోదవుతోందని తెలుస్తోంది. అమెరికాలో 5,000 నిఘా కేసులు నమోదు కాగా సగానికి పైగా చైనా కేసులే అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చైనా నిరంకుశ ధోరణిని తట్టుకోలేక ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లను కూడా డ్రాగన్ టార్గెట్ చేస్తోందని అమెరికాకు మరో నివేదిక అందింది. నివేదికల నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: