జగన్ కేసీయార్ ఇద్దరు మిత్రులే కానీ ఏపీ తెలంగాణా అని రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత ప్రజలు కూడా ఇద్దరినీ పోల్చుకుని చూడడం అలవాటు చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబుకు కూడా ఈ రకమైన పోలిక ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కరోనా వైరస్ విషయంలో కూడా రెండు ప్రభుత్వాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

 

తన ఇంటిముందు వరకూ ఇంకా చెప్పాలంటే తన క్యాంప్ అఫీస్ వరకూ కరోనా వచ్చినా కూడా జగన్ తాడేపల్లిలో ఉంటూనే రోజు వారీ సమీక్షలు చేస్తున్నారు. ఆయన గత నాలుగు నెలలుగా కరోనాను కట్టడి చేస్తూనే ఎక్కడా సంక్షేమానికి కూడా విరామం ప్రకటించలేదు. అంతే కాదు కరోనా వేళ వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో టెస్టింగులు కూడా భారీగా గత మూడు నెలలుగా చేస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా వల్ల మాత్రమే  జనం చనిపోతున్నారు అన్నది  తప్పని  అంటున్నారు తలపండిన వైద్య నిపుణులు. చాలా కేసుల్లో సరైన వైద్యం అందుబాటులోకి సమయానికి లేకపోవడం వల్లనే మరణిస్తున్నారు అని చెబుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులలో చేరలేక బిల్లులు కట్టుకోలేక చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు.

 

అయితే ఏపీలో ఆరోగ్యశ్రీని కరోనాకు కూడా జగన్ వర్తింప చేసి శభాష్ అనిపించుకున్నారు. దాని వల్ల ఎవరైనా తమకు కరోనా వల్ల అనారోగ్యంగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి సేవలు పొందవచ్చు. ఆ విధంగా చూసుకుంటే కరోనా కట్టడిలో ఇది అత్యుత్తమైన వైద్య  విధానం అంటున్నారు. అదే తెలనాణాలో చేయమని కూడా ఇపుడు డిమాండ్ వస్తోంది. నిజానికి ఏపీ పేద రాష్ట్రం, తెలంగాణా సంపన్న రాష్ట్రం, ఏపీలో జగన్ చేసింది కేసీయార్ ఎందుకు చేయలేడని బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి జగన్ నిర్ణయాలతో కేసీయార్ అక్కడ కార్నర్ అవుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: