కేరళలో కరోనా విలయతాండవం చేస్తుంది. నిన్నటి వరకు 300కు పైగా కేసులు నమోదు కాగా ఈరోజు ఏకంగా  కేసుల సంఖ్య 400 దాటింది. కాంటాక్ట్ కేసులు పెరుగుతుండడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 416 కేసులు నమోదయ్యాయని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. అందులో 204 కాంటాక్ట్ కేసులు కాగా 123 కేసులు  విదేశాలనుండి ,51 కేసులు మిగితా రాష్ట్రాల నుండి వచ్చినవారివి. ఈకేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6950కు చేరగా అందులో ప్రస్తుతం 3099 కేసులు యాక్టీవ్ గా వున్నాయి కాగా 3823 మంది బాధితులు కోలుకోగా కరోనాతో 28మంది మరణించారు.  
 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే  ఎప్పటిలాగే అత్యధికంగా తమిళనాడు లో 3680 కేసులు నమోదు కాగా కర్ణాటకలో  రికార్డు స్థాయిలో 2313 కేసులు నమోదయ్యాయి అలాగే తెలంగాణలో కొత్తగా 1278కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో1608కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో  కరోనా కేసుల సంఖ్య 80000 దాటగా 22000 మంది కరోనా తో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: