ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయింది. ఇకా ఎన్నికల్లో ఓడిన పార్టీని నిరాశ వీడలేదు. అధికారం ఇంకా తమ వద్దనే ఉందన్న భ్రాంతిలో టీడీపీ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే మళ్లీ ఎన్నికలు ఏంటి. అసలు స్థానిక ఎన్నికలే జరగలేదు. ఇపుడు ఉప ఎన్నికలు జరిగే సీన్ ఉందా అంటే అవును అంటున్నాయి రాజకీయ పరిణామాలు.

 

ఏపీలో ఒక ఎంపీ సీటుకు కచ్చితంగా ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. అది అందరికీ తెలిసిందే. నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు జగన్ని ధిక్కరించి ఉన్నారు. ఆయన మీద యాక్షన్ కి వైసీపీ హై కమాండ్ సీన్ లోకి  దిగింది. ఏకంగా లోక్ సభ స్పీకర్ ని కలసి అనర్హత పిటిషన్ ఇచ్చేసింది. దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఆయన రేపో మాపో తీసుకుంటే కచ్చితంగా ఉప ఎన్నికలు అక్కడ ఖాయమని అంటున్నారు.

 

ఇక మరో మూడు అసెంబ్లీ  సీట్లకు ఉప ఎన్నికలకు వైసీపీ పావులు కదుపుతోంది అంటున్నారు. క్రిష్ణా జిల్లా గన్నవరం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇపుడు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఆయనను టీడీపీ సస్పెండ్ కూడా చేసింది. అయితే ఆయన ఇపుడు తన పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. ఆయన ఈ విషయమై జగన్ తో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. జగన్ కనుక అంగీకరిస్తే తాను పదవికి రాజీనామ చేసి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంటున్నారుట.

 

ఇక ఇదే వరసలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం, అలాగే గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన మద్దాల గిరి. ఈ ఇద్దరూ కూడా జగన్ ఎపుడంటే అపుడు రాజీనామాలు చేస్తారని అంటున్నారు. అయితే జగన్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఒక ఎంపీ సీటుతో పాటు, మూడు ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు ఖాయమని అంటున్నారు.

 

ఈ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లను  గెలిచి అటు చంద్రబాబుకు షాక్ ఇవ్వడంతో పాటు ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులకు గట్టి హెచ్చరికలు పంపాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ కనుక ఉప ఎన్నికల వరకూ కధను తెస్తే మాత్రం ఏపీలో విపక్షాలకు గట్టి షాక్ తప్పదని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: