జియో.. ఎప్పటికప్పుడు శుభవార్తలు అందిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా జియో ఫైబర్ వినియోగదారులకు ఓ అద్భుతమైన శుభవార్త అందించింది. ఆ శుభవార్త వింటే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. అంతటి శుభవార్త ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ లయన్స్ గేట్ ప్లే.. జియోతో కలిసింది. 

 

IHG

 

దీంతో లయన్స్ గేట్ ప్లే సర్వీస్ లో ఉండే సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు అన్ని కూడా మీరు జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా ఉచితంగా చూడచ్చు. ఇంకా ఈ జియో టీవీ యాప్ ను జియో సెట్ టాప్ ద్వారా ఉపయోగించవచ్చు. అంటే జియోతో లయన్స్ గేట్ ప్లే ప్రీమియం యాక్సెస్ కూడా జియో ఫైబర్ వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. 

 

IHG

 

హార్రర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ ఇలా అన్ని రకాల కంటెంట్ ఇందులో ఉంటుంది. నిజానికి హాట్ స్టార్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కంటే ఎక్కువ ఒరిజినల్ కంటెంట్ ఇందులో ఉండనుంది. ఇంకా ఇందులో ఒరిజిల్ సిరీస్, ఇతర ప్రముఖ కార్యక్రమాలతో సహా.. 7,500 వేర్వేరు ప్రీమియం ఈ సైట్ లో చూడచ్చు. 

 

IHG

 

అంతేకాదు ఇది కలవడం వల్ల ఇందులో ఉన్న కంటెంట్ హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ జియో ఫైబర్ సిల్వర్, లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లు ఉపయోగించేవారికి మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: