చైనా మీద అగ్రరాజ్యమైన అమెరికా కు  కోపం నానాటికీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో కూడా చైనాపై విమర్శలు చేస్తూనే ఉంది అమెరికా. ముఖ్యంగా కరోనా  వైరస్ విషయంలో అయితే చైనాను  అమెరికా ఏకిపారేసిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నేపథ్యంలో అమెరికా చైనా పై చేసిన విమర్శలు సంచలనం రేపాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉంది అమెరికా.కాగా  అమెరికా ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలన్నది చైనా ప్లాన్.



దీని కోసం చైనా  ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాని దెబ్బ తీసేందుకు  ఎన్నోరకాల వ్యూహాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ రెండు దేశాలకు మధ్య పరస్పర విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి.అమెరికాని దెబ్బ తీయటానికి చైనా ఎన్నో ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం సరికొత్త విషయం  సంచలనంగా మారిపోయింది. చైనా నుంచి అమెరికాకు భారీ ముప్పు పొంచి ఉంది అని  అమెరికా కు సంబంధించిన గూడచార సంస్థ ఎఫ్బిఐ తెలిపింది . అమెరికా ఎఫ్బిఐ ఏజెన్సీ డైరెక్టర్... అమెరికా ప్రభుత్వానికి తాజాగా ఒక నివేదిక అందించారు.




 అందులో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం అమెరికాలో గూఢచర్యం చేయడంతోపాటు... డేటా చోరీకి యత్నం చేస్తుందని ఎఫ్బిఐ  ఒక  నివేదికను అమెరికా ప్రభుత్వానికి అందజేసింది. అంతేకాకుండా అమెరికాలో ప్రతి పదిగంటలకు  అమెరికా  డేటా  చోరీ కీ సంబంధించి ఒక కేసు నమోదు అవుతుంది అని తమ నివేదికలో తెలిపింది ఎఫ్బిఐ. అంతేకాకుండా చైనా ప్రభుత్వం ఫాక్స్ హంట్ అనే కార్యక్రమం ద్వారా ఏకంగా చైనా కు సంబంధించి విదేశాలలో ఉన్న పౌరులను  ప్రభావితం చేసి ఏకంగా తమ దేశానికి రప్పించడం లేదా అక్కడ ఆత్మహత్య చేసుకునేలా చేయాలని ప్రస్తుతం చైనా వ్యూహాలు పన్నుతోందంటూ ఎఫ్బిఐ నివేదికలో తెలిపింది.మరి  దీనిపై అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది చూడాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: