గత కొన్ని రోజుల నుంచి సరిహద్దులో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా గాల్వన్ లోయలో  ఉద్రిక్త పరిస్థితులకు కారణం కావడం.. ఏకంగా భారత సైనికుల పై దాడి చేయడం... సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరించడం లాంటివి చేసింది చైనా. అదే సమయంలో భారత్ కూడా సరిహద్దుల్లో భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించి చైనాకు ధీటుగా నిలబడింది. ఈ క్రమంలోనే చైనా కాస్త వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. అయితే  సరిహద్దుల్లో రెండు ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. కానీ చైనా డబుల్ గేమ్ మాత్రం ఆపలేదు,   అయితే రెండు చోట్లా చైనా సైన్యం వెనక్కి వెళ్లినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో చైనా సైన్యం మొహరించి డబుల్ గేమ్ ఆడుతుంది.. అంతేకాకుండా నేపాల్ ని  క్రమక్రమంగా ఆక్రమించుకుని అటు  నుంచి కూడా చైనా సైన్యం భారత్ ని  భయపెట్టేందుకు సిద్ధమైంది.




అటు భారత్ కూడా చైనా దొంగ నాటకాల నమ్మే పరిస్థితిలో లేదు. అందుకే భారత సైన్యం వీటిని ముందుగానే ఊహించి ఆ రెండు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం  ఎంతో అప్రమత్తంగా సంసిద్ధంగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రాంతంలో కూడా చైనా కొత్త ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఓ సరికొత్త స్కెచ్  వేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం భారత సైన్యం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లక్ష క్యూసెక్కుల నీటిని అస్సాంలోని నదిలోకి వదిలేందుకు చైనా కుట్ర  చేస్తుంది  అని భారత్ ఇంటిలిజెంట్ సైన్యానికి సమాచారం అందించింది.




ఈ నేపథ్యంలో ముందుగా అప్రమత్తమైన భారత సైన్యాధికారులు ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎగువ ఈ ప్రాంతంలో డ్యామ్  కట్టిన చైనా ప్రస్తుతం ఒక్కసారిగా లక్ష క్యూసెక్కుల నీటిని వదిలితే.. దిగువన  ఉన్న ప్రాంతాలు  మొత్తం నీట మునిగే అవకాశముంది. అందుకే ముందుగా అప్రమత్తమైన భారత సైన్యం ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరి చైనా ఎత్తుగడను భారత్ ఎలా  తిప్పి కొడుతుంది అన్నది చూడాలి మరి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: