భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్ లో 59 చైనీస్ యాప్స్ ని కేంద్రం నిషేదించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ కూడా బ్యాన్ అయ్యింది. అయితే ఎప్పుడు టిక్ టాక్ లో ఎంజాయ్ చేసే టిక్ ట్రక్ ప్రేక్షకుల కోసం భారత్ ఓ అద్భుతమైన యాప్ ని తీసుకొచ్చింది. 

 

అదే జోష్.. టిక్ టాక్ పోయినందుకు ఫీల్ అవుతున్న వారందరికీ డైలీ హంట్ పేరు మీద జోష్ అనే ఓ షార్ట్ మేనేజింగ్ వీడియో యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపు టిక్ టాక్ లానే దీనిలోనూ ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లు ప్రస్తుతానికి ఉన్నప్పటికీ ఇంతకు మించి యాప్స్ ని ఇచ్చేనందుకు డైలీ హంట్ జోష్ ప్రయత్నిస్తున్నట్టు తెలుసుతుంది. 

 

IHG

 

ఇంకా ఈ జోష్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లే స్టార్ లో అందుబాటులో ఉండనుంది. ఇంకా పలు భిన్న రకాల క్యాటగిరిల్లో ఈ షార్ట్ వీడియోలను పోస్ట్ చెయ్యచ్చు. అంతేకాదు.. మీరు పోస్ట్ చేసిన వీడియోలను చూసుకోవచ్చు కూడా. ఇంకా ఈ యాప్ కు గూగుల్ ప్లే స్టార్ లో కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. 

 

టిక్ టాక్ మిస్ అవుతున్నవారు ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని అంతకుమించి జోష్ పొందండి.. జోష్ యాప్ లో యూజ‌ర్లు త‌మ మొబైల్ నంబ‌ర్ ద్వారా లాగిన్ అయ్యి సొంత ప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేయ‌వ‌చ్చు. టిక్‌టాక్ క‌న్నా అద్భుత‌మైన‌, నాణ్య‌మైన షార్ట్ వీడియోల‌ను ఈ యాప్‌లో పోస్ట్ చేసే అవ‌కాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం టిక్ టాక్ ని మిస్ అవుతే వెంటనే ఈ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: