ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్0 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కిమ్ ఆగడాల గురించి జనాలందరికి బాగా తెలుసు. ఎన్నో ప్రత్యేక లక్షణాలు ఆయన సొంతం. నియంత పాలన చేస్తూ, దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కిమ్ కు సరదా అన్నట్టుగా ఉంటుంది. తనకు ఏది తోస్తే అది అమలు చేస్తూ, ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, కిమ్ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆధునిక నియంతగా కిమ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. కిమ్ జోంగ్ ఉన్ అనధికారికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారని, ప్రస్తుతం వ్యవహారాలన్నిటినీ కిమ్ సోదరి నడిపిస్తున్నారు అనే అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.

IHG's sister says another summit with the U.S. is ...

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ ఉండదంటూ కిమ్ సోదరి ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతి ఏడాది నిర్వహించే సమావేశాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశమే లేదని ప్రకటన చేయడం వెనక ఆమె సోదరి హస్తం ఉన్నట్లుగా అనుమానాలు మొదలయ్యాయి. కిమ్ జోంగ్ ఉన్ అంగీకరిస్తే డోనాల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ అవుతారు అంటూ నాలుగు నెలల కిందటే ఓ ప్రకటన చేశారు. ట్రంపు తో తన సోదరుడు కిమ్  ఎటువంటి సమావేశాన్నినిర్వహించడం లేదంటూ కిమ్ యో జోంగ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. అమెరికా, ఉత్తర కొరియా కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, రెండు దేశాల నేతలు దీనిపై ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారని, కిమ్ యో జోంగ్ భావిస్తున్నట్టుగా కొరియన్ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

 

ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ట్రంప్ తో భేటీ అవ్వకుండా, ఆమె సోదరి కిమ్ యో జోంగ్ చక్రం తిప్పింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కిమ్ జోంగ్ అనారోగ్యానికి గురైన సమయంలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఆయన పెద్దగా బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో పరిపాలన వ్యవహారాలన్నీ ఆమె సోదరి చూసుకుంటుందనే క్లారిటీ వచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే కిమ్ జోన్ ఉన్ జనాల్లోకి పెద్దగా రాకపోవడంతో ఈ అనుమానాలకు మరింతగా బలం చేకూరుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: