వైయస్ జగన్ అధికారంలోకి రావడంతో మొదటి లో తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ రాష్ట్రం ఫ్యాక్షనిస్టు చేతిలో నాశనం అవ్వడం గ్యారెంటీ అని సెటైర్లు వేశారు. వైయస్ జగన్ కి ఏమాత్రం అనుభవం లేదు అని విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత కష్టాలపాలు కావటం గ్యారెంటీ అని చాలామంది అప్పట్లో జగన్ గెలిచిన తర్వాత విమర్శలు చేయడం జరిగింది. కానీ వైఎస్ జగన్ ఏడాది పరిపాలన తర్వాత దేశంలో పరిస్థితి చూస్తే జాతీయ స్థాయిలో నాయకులు మరియు జాతీయ మీడియా జగన్ ఏడాది పరిపాలనపై అద్భుత రీతిలో పొగడ్తల వర్షం కురిపించింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రులలో ఏడాదికే ఏమాత్రం అనుభవం లేని వైయస్ జగన్ పరిపాలనకు నాలుగో స్థానం దక్కింది.

 

ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ జగన్ ఏమాత్రం సంక్షేమ పథకాలు ఆగిపోకుండా అందజేయడంతో పాటు కరోనా వైరస్ ని అద్భుత రీతిలో ఎదుర్కోవడంతో ఏపీ కరోనా వైరస్ విషయంలో సేఫ్ ప్లేస్ అని ప్రస్తుతం ఉన్న ఇతర రాష్ట్రాల నేతలు జగన్ తీసుకున్న నిర్ణయాలను తెగ పొగుడుతున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ ఏడాది పరిపాలనపై విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం జగన్ ఏడాది పరిపాలన జస్ట్ ట్రైలర్ మాత్రమే అని సోషల్ మీడియాలో అభివర్ణించారు.

 

దీనికే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే అని విజయసాయిరెడ్డి చంద్రబాబు పై సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో జగన్ మరింత సినిమా తెలుగుదేశం పార్టీకి చూపించడం గ్యారెంటీ అన్నా రైతు లో విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: