భారత్ ఆర్మీ సైనికులను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపట్టిన చైనా తో మోడీ అదే రీతిలో డీల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మన దేశ ఆర్మీ సైనికులు వెనకడుగు వేయకూడదని దెబ్బ కి దెబ్బ ఫార్ములానే శత్రు దేశాలపై ఉపయోగించాలని ఇటీవల చైనా సరిహద్దు ప్రాంతం లో పర్యటించిన సమయంలో మోడీ దేశ సైనికులకు తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గత నెల 15వ తారీఖున గాల్వాన్ లోయ ఘటన ని ఉద్దేశించి మోడీ దేశ సైనికులను గాల్వాన్ లోయ ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఎవరూ వెనకడుగు వెయ్య కూడదు అని మీ వెనకాల దేశం ఉందని చైనాతో యుద్ధం అంటే యుద్ధం అన్న రీతి లోనే సైనికులలో ఉండేలా మనో ధైర్యాన్ని నింపారు.

 

అంతకుముందే చైనా దేశానికి చెందిన 59 యాప్స్ కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ఈ విధంగా మోడీ సర్కార్ ఒక పక్క యుద్ధం అంటే యుద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ మరోపక్క చైనా ని ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కరోనా వైరస్ కారణంగా చైనా అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇదే టైములో అమెరికా కూడా ఇండియా కి సపోర్ట్ గా వస్తామని మద్దతు కూడా ఇటీవల తెలపడం జరిగింది. అవసరమైతే ఇండియా చైనా సరిహద్దుల్లో అమెరికా బలగాలను దించుతామని ప్రపంచ పెద్దన్న భారత్ కి భరోసా ఇచ్చింది.

 

ఈ దెబ్బతో మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అన్నివైపుల చైనా ని దెబ్బ కొట్టే రీతిలో వ్యవహరించడంతో చైనా కాళ్లబేరానికి వచ్చింది.  ఇండియా తమకు శత్రుదేశం కాదని, శాశ్వత మిత్ర దేశం అని ఇండియాలోని చైనా రాయభారి సన్ విడాంగ్ పేర్కొన్నాడు. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుంటామని, ఇండియా చైనా మధ్య సంబంధాలు తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని అన్నారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలు కొనసాగుతాయని మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: