ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం వాదనలను తిరస్కరించింది. స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల పని ఆగకుండా తాత్కాలిక ఎన్నికల అధికారిని నియమించాలని సుప్రీం'లో ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. ఎన్నికల గురించి తాము ప్రస్తుతానికి వ్యాఖ్యానించమని అయితే తుది విచారణ మూడు వారాలలో ముగిస్తామని చెప్పుకొచ్చింది.

IHG

మొత్తం మీద పరిస్థితులు బట్టి చూస్తే మరోసారి సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టికాయ పడే వ్యతిరేకత తీర్పు రెడీగా ఉన్నట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకి జగన్ వెళ్లే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాడా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

IHG

ఒకవేళ నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కరోనా కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంది. మరి ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ ఎన్నికలకు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో వెళ్తారా లేదా అన్నది ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆలస్యం చేస్తే ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాలు మొత్తం రద్దయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నిమ్మగడ్డ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సర్కార్ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేనట్లు పార్టీలో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: