తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నానాపాట్లు పడుతున్నారు. అధికార పార్టీ ఒకపక్క కేసులతో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను గట్టిగా టార్గెట్ చేయడంతో చాలా మంది నాయకులు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా భారీస్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తూ జగన్ ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తూన్న తరుణంలో పొలిటికల్ ఫీచర్ కోసం మరికొంత మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ ని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా కేంద్రం తోనే చేతులు కలపాలని చంద్రబాబు సరికొత్త స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

IHG

ఇటీవల చంద్రబాబు మాట్లాడిన తీరు ఒకసారి గమనిస్తే చాలాసార్లు ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన పై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ పదే పదే కేంద్రాన్ని కోరడం జరిగింది. అలాగే కరోనా కట్టడి విషయంలో మరియు ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు పదేపదే కోరుతున్నారు. ఇటీవల వైయస్ జగన్ ప్రారంభించిన అంబులెన్స్ కాంట్రాక్టు విషయంలో అవినీతి జరిగిందని టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

IHG

ఈ సందర్భంగా వీటిని ఆధారం చేసుకుని బీజేపీ పార్టీ తో ఏపీ సర్కార్ పై కేసు వేయించాలన్నే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో చాలా చోట్ల జగన్ సర్కార్ అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తీసుకుని ఈ రెండు విషయాల్లో బీజేపీతో టీడీపీ కలిసి జగన్ సర్కార్ పై పోరాటం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: