మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల తర్వాత కేసిఆర్ పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసిఆర్ ఆరోగ్యం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలావరకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకుతున్న తరుణంలో కేసిఆర్ కి కూడా సోకింది ఏమో అన్న అనుమానంతో రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూ డిమాండ్ చేశారు. ఇదే తరుణంలో తెలంగాణలో సచివాలయం కూల్చివేత పై స్పందించారు. మూఢనమ్మకాలతో ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదు అన్నట్టుగా తీవ్రస్థాయిలో కేసిఆర్ సర్కారుపై మండిపడ్డారు.

 

అంతేకాకుండా కరోనా కట్టడి విషయంలో గవర్నర్ పిలిచినా తెలంగాణ ప్రభుత్వ అధికారులు రాకపోవటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అని వెంటనే వాళ్లను పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విషయాలలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ సైలెంట్ గా ఉండటం పై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరియు రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు. హైదరాబాదులో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారు అనే వార్త రావటంతో తెలంగాణలో చాలా మంది ఇతర ప్రాంతాల్లోకి వెళ్లిపోతున్నారని కాబట్టి తెలంగాణ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 

ఇదిలా ఉండగా కేసిఆర్ కి కరోనా అంటూ రేవంత్ రెడ్డి తెగ భయపడిపోవటం పై సెటైర్లు పడుతున్నాయి. అస్సలు ఆయనకంటే ముందు కేటీఆర్ భయపడాలి. ఈ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డికి అంత అత్యుత్సాహం..?  సీఎం అవ్వాలన్న అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇలాంటి టైం లో ప్రతి సమస్యను రాజకీయంగా చూడకుండా మానవత్వంతో ఆలోచించాలని తెలంగాణ రాజకీయ నాయకులను నెటిజన్లు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: