తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణాన్ని కే‌సి‌ఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటినుండో సచివాలయం మార్చాలని చూసిన కే‌సి‌ఆర్ కి ఇటీవల అనుమతులు ఫుల్ గా రావడంతో తన ఫేవరెట్ బిల్డింగ్ కోసం కొత్త డిజైన్లు తీసుకువచ్చి ప్రజలకు కూడా చూపించడం జరిగింది. సోషల్ మీడియా లో రిలీజ్ అయిన తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్లు చూసి సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం జరిగింది. విడుదలైన తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ చెన్నైకి చెందిన అస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపొందించింది. ఆ సంస్థకు చెందిన భార్య భర్తలు ఇద్దరూ ఎనిమిది నెలలు కష్టపడి తెలంగాణ సచివాలయం డిజైన్ రూపొందించి కేసీఆర్ కి చూపించడంతో ఆయన ఇటీవల ఓకే చెప్పటం జరిగింది.

 

ఈ డిజైన్ కి స్ఫూర్తి నిజామాబాదు లోని నీలకంఠేశ్వరాలయం అని చెబుతున్నారు. అప్పట్లో కాకతీయుల నాటి నిర్మాణ శైలి ఆధారం చేసుకుని దక్కన్ కల్చర్ తో పాటు పచ్చదనం.. పర్యావరణ రహితంగా ఉండేలా తమ డిజైన్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎక్కడ వాస్తు దోషం లేకుండా డిజైన్ సిద్ధం చేసినట్లు అదే విధంగా స్థలం ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్త పడినట్లు డిజైన్ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. హైదరాబాదు ప్రాంతంలో మరియు ఇంకా కొన్ని చోట్ల నిర్మించిన కట్టడాలన్నీ పరిశీలించిన తర్వాతే ఫైనల్ గా ఈ డిజైన్ రూపొందించినట్లు తెలిపారు.

 

అంతేకాకుండా ప్రపంచంలో సింగపూర్ మరియు మలేషియా లాంటి దేశాల్లో కొన్ని షాపింగ్ మాల్స్ కి పని చేసినట్లు అదే విధంగా దేశంలో వివిధ కట్టడాలకు డిజైన్లు ఇచ్చినట్లు చెన్నైకి చెందిన అస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. మొత్తానికి కేసిఆర్ తన ఫేవరెట్ బిల్డింగ్ కోసం మహామహుల నే దింపటం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: