ప్రపంచ దేశాలు మరియు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎదుర్కొనడంలో చాలావరకు చేతులెత్తేసిన పరిస్థితి ప్రభుత్వాలలో నెలకొంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం  పరిస్థితి వేరు. చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలు వ్యాపారాలు చేసుకోలేక, ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేక, కుటుంబాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయినా గాని ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పెద్దగా ప్రజలను పట్టించుకున్న సందర్భాలు కనబడటం లేదు. కొంతమంది కరోనా రోగులు హాస్పిటల్స్ లో బిక్షం ఎత్తుకునే లాగా వాళ్లని వరండాలో పడుకోబెట్టిన పరిస్థితి ఇటీవల కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని రాష్ట్రాలలో వీడియోలు బయటపడ్డాయి.

 

అంతేకాకుండా ఆయా రాష్ట్రాలు కరోనా టెస్టులు విషయంలో ట్రీట్ మెంట్ విషయంలో ఏమాత్రం కనికరం ప్రజలపై లేకుండా వ్యవహరిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ మొత్తం రివర్స్. ఎక్కడికక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు పైగా ఉచితంగా జగన్ ప్రభుత్వమే చేయటం ఇప్పుడు దేశంలోనే పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తరుణంలో చాలా వరకు కేసులు బయట పడిపోవడంతో ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకున్న సంఘటనలు ఏమి లేవు. ఎవరికివారు వ్యాపారాలు చేసుకుంటూనే మరోపక్క పేదవాళ్ళు తమ పనులను చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

 

పూర్తిగా రాష్ట్రంలో వైరస్ విజృంభన తగ్గించడానికి ప్రభుత్వ ఆర్టీసీకి చెందిన 52 బస్సులను తీసుకుని వాటిని కరోనా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ గా మార్చుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 30 బస్సులను కరోనా టెస్టులు చేయడానికి అంతా సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. మిగిలిన బస్సులను కూడా త్వరలోనే పూర్తిగా సిద్ధం చేసి జిల్లాలకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో ఏపీలో అద్భుతంగా కరోనా కంట్రోల్ కావడం గ్యారెంటీ అని జాతీయ మీడియా జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోపక్క  పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో కంటే ఆంధ్రాలో ఉంటే ఎలాంటి వైరస్ సోకదు అని ఏపీలో కి తెగ వచ్చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: