చైనా ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిలో విలువలు లేని దేశంగా, ప్రపంచానికి ముప్పుగా పరిగణించబడుతుంది.. టెక్నాలజీని తన గుప్పిట్లో పెట్టుకుని పిల్లి మొగ్గలు వేస్తుంది.. కరోనా వ్యాప్తికి కారణం అవడమే కాకుండా, భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ఘర్షణకు తెరలేపింది.. అసలు ఈ సమయంలో వైరస్ నిర్మూలనకు ప్రపంచంతో కలిసి పనిచేయవలసిన ఆ దేశం ఒక నియంతలా వ్యవహరిస్తూ తన అధికారాన్ని విస్తరించుకునే దిశగా పావులు కదుపుతుంది..

 

 

ఇక వివిధ దేశాలను నమ్మించి నట్టేట ముంచడం చైనా చరిత్రలో కొత్త ఏం కాదు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెండు దేశాల అమధ్య చెలరేగుతున్న సరిహద్దు వివాదం మరింత ముదిరి మనదేశ సైనికుల ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన తర్వాత ఇండియా అంటే ఏంటో చైనాకు అర్ధం అయ్యినట్లుగా ఉంది.. అందుకే రాజీకి వచ్చి సైనిక ఉపసంహరణ చేస్తుంది.. కానీ ఇక్కడ తన నక్క జిత్తులను ప్రదర్శిస్తుంది.. ఈ క్రమంలో గ‌త‌ వారంతో పోలిస్తే.. ప్ర‌స్తుతం ల‌ద్దాఖ్‌లోని గల్వ‌ాన్ లోయ‌ స‌మీపంలోని హాట్ స్ప్రింగ్స్ గ‌స్తీ పాయింట్ 14, 15 ద‌గ్గ‌ర కూడా రెండు సైన్యాలు త‌మ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకున్నాయి.

 

 

అయితే కధ ఇంతటితో ముగిసిపోలేదు.. ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి గల్వ‌ాన్‌కు ఉత్త‌రాన ఉన్న ప్యాంగాంగ్ స‌ర‌స్సుపై పడుతోంది. అదీగాక మీడియాలో ఫింగ‌ర్ 4 ప్రాంతంలో త‌గ్గుతున్న చైనా సైనికుల సంఖ్య‌ను గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. ఇకపోతే ఫింగ‌ర్ 8 లో గ‌స్తీ కాసేందుకు భార‌త సైనికులు ఈ ప్రాంతం మీద నుండే వెళ్లాల్సి ఉంటుంది. కాగా రెండు దేశాల సైనికుల శిబిరాలు ఫింగ‌ర్ ప్రాంతంలో ఉన్నాయి.

 

 

కాబట్టి చైనా చెబుతున్నట్లుగా, ఫింగ‌ర్‌-4లోని త‌మ నిర్మాణాల‌ను ధ్వంసంచేసి వెన‌క్కి వెళ్తేనే.. ఆ దేశాన్ని మ‌నం న‌మ్మ‌గ‌లం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే చైనా తన సైనికుల సంఖ్యను కొంచెం త‌గ్గించిన మాట వాస్త‌వ‌మే అయినప్పటికి, మిగ‌తా ప్రాంతాలతో పోలిస్తే, ఇక్క‌డ వారు వెనక్కి వెళ్ల‌లేదు.మాకు తెలిసినంత వ‌ర‌కు చైనా భారత్ దృష్టిని మళ్లించడానికి వారి సైనికుల్ని అటూ ఇటూ తిప్పుతున్నారని ప్ర‌భుత్వవ‌ర్గాలు కూడా వెల్లడించాయి..

 

 

ఇకపోతే చైనా ఈ వివాదాలకంటే ముందే ఇక్కడ అధిక సంఖ్యలో సైనిక బ‌ల‌గాల‌ను మోహరింపచేయడం వల్ల ఒక పావు వంతు సైన్యాన్ని సడలించినా ఇప్ప‌టికీ ఇక్క‌డ‌ ఎక్కువ‌ మంది సైనికులే ఉన్నారని ప్యాంగాంగ్ స‌ర‌స్సు ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న మ‌రో అధికారి పేర్కొన్నారు.. ఇక రెండు దేశాల మ‌ధ్యా స‌రిహ‌ద్దులపై అంగీకారం కుద‌ర‌నంత వ‌ర‌కూ సైనికుల మోహ‌రింపులు ఇరువైపులా భ‌యాన‌కంగానే క‌నిపిస్తాయి..

 

 

ఈ పరిస్దితి తొలగాలంటే ఈ స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్కారం అవ్వాలి. ఇందుకు గాను ఆరు నుంచి ఎనిమిది నెల‌ల సమయం పట్టవచ్చనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు అధికారులు. ఈ లోపల చైనా ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడకుంటే వివాదం సామరస్యంగా సద్దుమనుగుతుంది. లేదంటే ఈ పరిస్దితులు ఎక్కడికి దారితీస్తాయో చూడాలంటున్నరట అధికారులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: