గత కొన్ని రోజుల నుంచి చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు చైనా నిషేధిత ప్రాంతం దాటి భారత సరిహద్దుల వరకూ వచ్చి ఏకంగా భారీగా సైన్యాన్ని మోహరించడం చేసింది .. మరో వైపు భారత్ కూడా చైనాకు దీటుగా బదులు ఇవ్వడానికి భారీగా సైన్యాన్ని మోహరించడం తో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే అజిత్ దోవల్ చర్చలు జరపడంతో చైనా వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. రెండు చోట్ల చైనా సైన్యం వెనుతిరిగింది. గాల్వాన్ లోయ, సిక్కిం లాంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చైనా సైన్యం వెనక్కి వెళ్ళింది.



 అయితే చైనా వెనక్కి వెళ్ళింది వివాదం ముగిసింది  అని అనుకుంటున్న తరుణంలోనే మరోసారి డబుల్ గేమ్ స్టార్ట్ చేసింది చైనా. రెండు ప్రాంతాల్లో వెనక్కి వెళ్లిన చైనా పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం అలాగే తిష్ట వేసుకుంది . పాంగ్వాన్  సరస్సు దగ్గర ఫింగర్ 8 దగ్గరికి వెళ్లాల్సిన  చైనా సైన్యం కేవలం ఫింగర్4 నుంచి ఫింగర్ 5 వరకు మాత్రమే వెనక్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారత్-చైనా చర్చలు అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. వాస్తవంగా అయితే ఫింగర్ 1 వరకు భారత దేశానికి చెందిన భూభాగమే... అప్పట్లో కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యం  అటువైపు వెళ్ళగానే అదే అదునుగా భావించి చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది.


ఇక ప్రస్తుతం  రెండు చోట్ల చైనా సైన్యం వెనుదిరిగినప్పటికీ  పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం చైనా సైన్యం వెనుదిరిగేందుకు  ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. నో మాన్ జోన్ లో  భారత సైన్యం నిర్మించిన హెలీపాడ్స్ తొలగిస్తేనే తాము వెనక్కి వెలతాం  అంటూ డిమాండ్ చేస్తోంది... ఈ సమయంలో హెలిపాడ్ ని తొలగించే ప్రసక్తే లేదు అంటూ భారత సైన్యం చెబుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో రెండు ప్రాంతాల్లో మాత్రం చైనాతో వివాదం ముగిసినట్లే  కనిపిస్తున్నప్పటికీ... పాంగ్వాన్ సరస్సు  దగ్గర మాత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది, చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: