మామూలుగా ఎవరినైనా మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా  అంటే.. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెబుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఓ వ్యక్తిని అడిగితే ఇలాగే చెబుతాడు... అయితే ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే పెళ్లి పీటలపై... ఒకేసారి ప్రియురాలికి,  పెద్దలు కుదిర్చిన అమ్మాయికి తాళి కట్టాడు ఇక్కడ వరుడు. ఏంటి ఆశ్చర్య పోయారు కదా...కానీ ఇది నిజమే. ఓకే పెళ్లిలో వరుడు ఇద్దరి కి తాళి కట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని బేతుల్  లో జరిగింది. ఓకే పెళ్లి వేదికపై తాను ప్రేమించిన అమ్మాయికి పెద్దలు కుదిర్చిన అమ్మాయి కి తాళి కట్టాడు  యువకుడు. వివరాల్లోకి వెళితే సందీప్ అనే యువకుడు భూపాల్ లో చదువుకునే రోజుల్లో హోషంగా బాగ్  కు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతినే  పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు.



 అయితే ఇటీవలే సందీప్ తల్లిదండ్రులు మాత్రం సందీప్ కు ఓ పెళ్లి సంబంధం చూశారు. సందీప్ తనకు ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ అతని  అనుమతి లేకుండానే ఏకంగా వధువు కుటుంబానికి ఓకే చెప్పారు సందీప్ తల్లిదండ్రులు. ఇక తాను ప్రేమిస్తున్న విషయాన్ని అప్పటివరకు దాచిన సందీప్... పెళ్ళి జరిగాకా తన చేతుల్లో ఏమీ ఉండదని భావించి... తాను తన ప్రియురాలిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్పాడు. ఇక ఈ విషయం కాస్త పెద్దలు కుదిర్చిన యువతి తల్లిదండ్రులకు తెలియడంతో... గ్రామ పెద్దలు ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు మూడు కుటుంబాలను కూర్చోబెట్టి వారి అందరి మధ్య సంధి కుదిర్చారు. సందీప్ ప్రియురాలి తో పాటు పెద్దలు కుదిర్చిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలంటూ నిర్ణయించారు  గ్రామ పెద్దలు.


 ఇద్దరు  యువతులు కూడా అంగీకరించారు. దీంతో సందీప్ ఓకే మండపంలో పెద్దలు కుదిర్చిన అమ్మాయికీ,  తాను ప్రేమించిన అమ్మాయి కి తాళి కట్టాడు. దీంతో ఆ పెళ్ళికొడుకు తన ప్రేమ పంతం తో పాటు పెద్దల మాటను కూడా నిలబెట్టారు అని అందరు అనుకుంటున్నారట.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: