ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు ? ఏ నిర్ణయం తీసుకున్నా అకస్మాత్తుగానే తీసుకుంటారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్నా, మోదీ పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున మూటగట్టుకున్నారు . అలాగే రాజకీయంగానూ అనేక ఎదురు దెబ్బలు తింటూ వస్తున్నారు. వీటి నుంచి కాస్త రిలీఫ్ అయ్యేందుకు అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేసి, సమర్థవంతమైన వారిని మంత్రులుగా తీసుకోవాలని, పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ కరోనా వైరస్ ప్రభావానికి ముందుగానే కేబినెట్ ప్రక్షాళన చేయాలని చూశారు. ఆకస్మాత్తుగా ఈ వైరస్ ప్రభావం రావడం, లాక్ డౌన్ తదితర కారణాలతో దానిని వాయిదా వేసుకుంటూ వచ్చారు.

IHG

కొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, కేబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ , తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు చెందిన వారికి మంత్రిమండలిలో అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా కు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మల సీతారామన్ ను కూడా తప్పించి వేరే శాఖ ఆమెకు అప్పగించాలని చూస్తున్నారు.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో ఈ దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సమర్థుడైన ఆర్థిక నిపుణుడికి బాధ్యతలు అప్పగిస్తే, కాస్త ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా మరికొంత మంది మంత్రుల శాఖలను మార్చడం, మరికొంతమందిని తప్పించడం, కొత్త వారికి చోటు కల్పించడం ఇలా భారీగానే మార్పుచేర్పులను చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: