చైనా దక్షిణాసియాలో అతి పెద్ద దేశం. భారత్ వైపు నుంచి చూస్తే కూడా మరో అతి పెద్ద దేశం ఈ రెండు దేశాల జనభా మొత్తం ప్రపంచంలో మూడవ వంతు ఉంది. అదే విధంగా జీడీపీ తీసుకున్నా కూడా దాదాపుగా అంతే ఉంది. పైగా మానవ వనరులు కూడా ఈ రెండు దేశాల్లొనే ఎక్కువ. టెక్నాలజీ పరంగా, ఇతర అభివ్రుధ్ధిపరంగా చూసుకున్నా ఈ రెండు దేశాలు ప్రపంచంలో ధీటుగా ఉన్నాయి.

 

అటువంటి రెండు పెద్ద దేశాలూ తరచూ గొడవలు పడుతూ ఘర్షణలు పడుతూ ప్రపంచంలో చిన్నబోతున్నాయి.  చైనా చిన్న దేశాలతో దోస్తీ చేస్తూ తాను ప్రపంచ పెద్దను కావాలనుకుంటోంది. భారత్ తప్పనిసరిగా అమెరికాతో మిత్రత్వం నెరపాల్సివస్తోంది. ఎందుకంటే భారత్ అవసరాలు అలాంటివి.

 

అలా కాకుండా ఈ రెండు దేశాలు కనుక చేయి కలిపితే ప్రపంచం తీరే మారిపోతుంది. అగ్ర రాజ్యాలు అని చెప్పుకునేవి కూడా కాళ్ళ దగ్గరకు వస్తాయి. 1990లలో సోవియట్ యూనియన్ పతనం తరువాత అమెరికాకు పోటీ లేకుండా పోయింది. రష్యా సైతం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నేపధ్యంలో భారత్, చైనాలు సమీప భవిష్యత్తులో  ప్రపంచంలో అగ్ర భాగాన‌ నిలిచేందుకు చూస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా ప్రపంచాన్ని శాసించాలంటే భారత్ చైనా కలసి ముందుకు సాగడం ఉత్తమమైన మార్గమని అంతా సూచిస్తున్నారు. భారత్ లో పుట్టిన బుద్ధ్ధుడు చైనాలో శాంతికి సంకేతంగా నిలిచాడు. ఇక ఈ రెండు దేశాలూ ఇరుగూ పొరుగుగా ఉన్నాయి. ఒకరి కష్టాలు, ఇష్టాలు ఇద్దరికీ తెలుసు.

 

పండిట్ నెహ్రూ టైంలో చైనా, భారత్ ల మధ్యన సంబంధాలు  మొదట్లో బాగుండేవి. భారత్ స్వయంగా సిఫార్స్ చేయడం వల్లనే చైనాకు ఐక్య రాజ్య సమితిలో చోటు దక్కింది. మళ్ళీ నాటి రోజులు రావాలంటే రెండు దేశాలూ చేయి కలపాలి. కలహాలు వీడాలి. అది ఈ రెండు పెద్ద దేశాలకే కాదు, ప్రపంచానికే దిక్సూచిగా ఉంటుంది. అందుకు భారత్ రెడీవే.  కానీ చైనా కలసి వచ్చేందుకు సిధ్ధమేనా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: