దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. మనం జాగ్రత్తగ ఉంటేనే కరోనా నుంచి రక్షింపబడతాం అంటూ ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన వారు.. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఎన్నో రకాలుగా అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. కానీ కొంత మంది ప్రజలు మాత్రం అబ్బే ఇవన్నీ మాకు అవసరం లేదు.. మా రూట్లో మేం వెళ్తాం అంటున్నారు. ఇక భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

IHG

లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,93,802కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,604కి పెరిగింది. 2,76,685 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,95,513 మంది కోలుకున్నారు. ఇక కరోనా నుంచి మనల్ని రక్షించుకోవాంటే మాస్క్ తప్పని సరి ధరించాలి. ఇది జీవితంలో ఒక భాగంగా భావించాలని అంటున్నారు. కానీ చాలా మంది రోడ్డు మీదకు మాస్క్ లేకుండా వస్తున్నారు.  తద్వారా తమ ప్రాణాలను రిస్క్ లో వేయడమే కాకుండా ఎదుటువటి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు.

IHG

దీంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష విధిస్తున్నారు. సిలిగురి పోలీసులు రోడ్లపై మాస్క్ ధరించకుండా వచ్చిన వారిని రోడ్డుపై రెండు గంటలపాటు కూర్చోబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధిస్తున్నారు. రోడ్డు పై రెండు గంటలు కూర్చోబెడితే పరువు పోతుందని ఈ శిక్ష బాధితులు అంటున్నారు. ఇంకోసారి మాస్క్ పెట్టుకోకుండా బయటికి రామని చెబుతున్నారు. సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో అక్కడి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: