ప్రస్తుతం భారత దేశం పై కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  రక్కసి మాత్రం కోరలు చాస్తూనే ఉంది. దీంతో ఎంతోమంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఇలా రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్న  విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ... ఈ వైరస్కు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో... ప్రస్తుతం అందరూ ప్రాణాంతకమైన కరోనా గురించి అవగాహన పెంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా కొంతమంది అవగాహన లేమితో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.



 తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దేవాంగ వీధికి  చెందిన 58 ఏళ్ల  ఫాన్సీ వ్యాపారి ఇటీవలే కరోనా  వైరస్ బారినపడి మరణించాడు. అయితే ప్రాథమిక దశలోనే ఇవి కరోనా  వైరస్ లక్షణాలు అని గుర్తించినప్పటికీ... నిర్లక్ష్యం అవగాహన లేమితో వైద్యం చేసుకునేందుకు ముందుకు రాలేదు. క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని భయపడి తనకు కరోనా  లక్షణాలు ఉన్నాయని బయటకి చెప్పలేదు. చివరికి ఆరోగ్యం విషమించి ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. కాగా ఈ ఫ్యాన్సీ వ్యాపారి లో దగ్గు జ్వరం లాంటి కరోనా  వైరస్ లక్షణాలు కనిపించిన ప్రాథమిక దశలోనే అతని భార్య... అతన్ని ఆసుపత్రికి వెళ్లాలి  అంటూ ఎన్నో సార్లు బతిమాలింది. ఎన్నోసార్లు ఆసుపత్రికి వెళ్లాలి అంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ సదరు వ్యాపారి మాత్రం కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించలేదు.



 ఇక కొన్ని రోజుల తర్వాత భార్య వార్డ్ వాలెంటర్ కు చెప్పగా.. వైద్య సిబ్బంది వచ్చి అతనికి  పరీక్షించి కరోనా  లక్షణాలే  అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి భార్యను ఆ వ్యాపారితో విడి గా ఉండమని చెప్పారు. ఇక రిపోర్టుల్లో అతనికి పాజిటివ్ అని వచ్చింది. కానీ అంతలోపే పరిస్థితి చేయి దాటిపోయింది. సదరు వ్యాపారి తీవ్ర శ్వాసకోస సమస్యతో బాధపడుతూ ప్రాణాలు వదిలాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: