దేశంలో కరోనా విజృభిస్తున్న సమయం ఇది. ఈ కష్టకాలంలో జీవనోపాధి కోల్పోయి చాల మంది రోడ్డున పడ్డారు. ఎంత చదువు చదివిన ఉద్యోగం రాలేదని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆసరాగా తీసుకోని వారికీ వల వేస్తుంటారు మోసగాళ్లు. ఉద్యోగం అంటే ఎవరికీ మాత్రం ఆశ ఉండదు చెప్పండి. అలా మోసగాళ్ల వలలో చిక్కి ఘోరంగా మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖలో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగాలు, ఇంటర్వ్యూలంటూ మాయమాటలతో మహిళలను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు కాజేస్తున్న మోసగాడిని విశాఖలోని గాజువాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బండారు రామ్‌చరణ్‌ కుమార్‌ అలియాస్‌ రవి.. రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ వారి నుంచి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. 

 

 

బాధితులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌ పోలీసులు గతంలో అతడిని అరెస్ట్చేశారు. జూన్ ఒకటో తేదీన అక్కడ నుంచి తప్పించుకొని పరారైయ్యాడు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

 

 

విశాఖకు మకాం మార్చిన రామ్‌చరణ్ లంకెలపాలెంలోని వాంబే కాలనీలో అద్దెకు దిగాడు. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు అతడిని నమ్మారు. దీంతో వారి ఇంటర్వ్యూల పేరుతో చాలా ఆఫీసులకు తీసుకెళ్లాడు. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ఎలాంటి ఆభరణాలు ధరించకుండా పేదవారిగా కనిపిస్తే ఉద్యోగం వస్తుందని నమ్మ బలికాడు. తాను ఆభరణాలు భద్రంగా దాస్తానని చెప్పి వారి నుంచి తీసుకుని పరారైయ్యాడు.

 

 

మోసపోయామని గ్రహించిన మహిళలు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి నుండి నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, ఓ బైక్ స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే  రామ్‌చరణ్‌పై గాజువాకలో 3, రాజమహేంద్రవరంలో 4, విజయవాడలో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు ఈ సందర్బంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: