ఇప్పుడు అంద‌రి చూపు, ఆందోళ‌న‌, స‌మ‌స్య క‌రోనాపైనే. కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రతి దినం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. WHO అంచనా ప్రకారం కేసులు పెరగడంతో పాటు మరణాలు సంఖ్య కూడా పెరగొచ్చట. దేశవ్యాప్తంగా ప్రభావిత కేసులు 8 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఈ వ్యాధి ఎలా వ‌స్తుంది?  రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ఎలా అనేది ఆలోచిస్తూ...ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్రజలు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో తాజాగా ఓ కీల‌క‌మైన అంశాన్ని వైద్యులు సూచించారు. గ‌త కొద్దిరోజులుగా మ‌నం దాన్ని పాటిస్తున్న‌ప్ప‌టికీ, వాటి ప్రాధాన్యాత‌ను గుర్తు చేస్తున్నారు. అదే నిమ్మకాయలు, కోడిగుడ్లు. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మార్గం. అందుకోసం శరీరంలో ఈ పవర్‌ను పెంచుకోవడానికి సీ విటమిన్, ఐరన్‌ వంటివి అధికంగా ఉండే నిమ్మరసం, గుడ్లు తీసుకోవాలని  వైద్యులు సూచిస్తున్నారు. 

 

మ‌న‌కు సుల‌భంగా అందుబాటులో ఉండ‌ట‌మే కాకుండా, ఇప్పుడు అత్య‌వ‌స‌ర‌మైన ఈ రెండింటితో మ‌నం ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. కోడిగుడ్ల ద్వారా మంచి ప్రోటీన్లు లభిస్తాయి. దీనిలో విటమిన్ ఏ, డీ ఐరన్ లాంటివి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి‌ పెరుగుతుంది. నిమ్మకాయలో అధికంగా ఉండే సీ విటమిన్ రోగ నిరోధ‌క శ‌క్తిని విశేషంగా పెంచుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండింటి విని‌యోగం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించే నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇప్పుడు నిత్యం వినియోగిస్తున్నారు. దీంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. 

 


కరోనా వైరస్ అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ రావడానికి కనీసం మరో 3-6 నెలలు పట్టేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవాల‌ను వైద్యులు చెబుతున్నారు. విటమిన్-సి  లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో నిమ్మ‌కాయ ముందుంటుంది. లెమ‌న్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి. క‌రోనా కోణంలోనే కాకుండా మ‌రో రూపంలోనూ నిమ్మ చేసే మేలు ఎంతో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. నిమ్మకాయ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ మ‌రే పండ్లలోనూ లభించదు. అందుకే ఇటు ఆరోగ్యం, అటు కరోనాను దూరం చేయ‌డం కోసం నిమ్మ‌పండ్ల‌ను జీవితంలో భాగం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: