పేకాటరాయుళ్ల బెడతా ఈ మధ్య కాలంలో మరింత పెరిగిపోయింది. ఒకసారి పేకాట మొదలు పెట్టారంటే  భారీ మొత్తంలో నగదు చేతులు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు లక్షల్లోనే పేకాటలో పందెం కాస్తూ ఉంటారు. కాస్త తీరిక దొరికితే చాలు చక్కగా దుకాణం పెట్టేసి పేకాట మొదలుపెడతారు. అయితే పేకాటరాయుళ్లను పట్టుకోవడానికి ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పేకాట స్థావరాల పై దాడి చేసి  అరెస్టులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పేకాటరాయుళ్లు కూడా పోలీసులకు దొరక్కుండా సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా పేకాటరాయుళ్లు రూటు మార్చి సరికొత్తగా ఆలోచించి టెక్నాలజీని బాగా వాడేసుకుంటున్నారు.



ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభం.. ఈ సమయంలో పోలీసులకు దొరికితే ఉన్న డబ్బు మొత్తం పోతుంది... ఈ నేపథ్యంలోనే పోలీసులకు డబ్బులు దొరకకుండా డిజిటల్ చెల్లింపుల  వైపు పేకాటరాయుళ్లు అడుగులు వేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూ డిజిటల్ చెల్లింపులు చేస్తూ పేకాట ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లోని పొట్టిలంక దగ్గర పౌల్ట్రీ ఫారం షెడ్లు కేంద్రంగా పేకాట రాయుళ్లు మకాం మార్చేశారు. ఎన్నో రోజుల నుంచి అక్కడ పేకాటరాయుళ్లు బృందాలుగా ఏర్పడి మరి పేకాట ఆడుతున్నారు.



ఈ క్రమంలోనే  కీలక సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరాలపై రైడ్ నిర్వహించి ఏకంగా 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. కానీ ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే పేకాట స్థావరాలలో  ఎలాంటి డబ్బులు దొరకలేదు. ఇదేంటి అని ఆరా తీస్తే పేకాటరాయుళ్ల సరికొత్త ఆలోచన బయటపడింది. వీళ్లంతా ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసుకుంటున్నారట. అంతేకాదండోయ్ వీళ్లందరూ కలిసి ఒక రూల్ కూడా పెట్టుకున్నారట... ఎవరైనా పేకాట ఆడాలంటే వారి అకౌంట్లు 50 వేల నగదు ఉండాల్సిందే. అలా ఉంటేనే పేకాట ఆడటానికి  అనుమతిస్తారట.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: