మనిషి జీవితంలో గాలి నీరు వ్యాయామం ఆహారం ఎంత ముఖ్యమో... నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర ఒక మనిషిని ఎంతో ఆరోగ్యంగా ఉంచగలదు... అదే నిద్ర  ఒక మనిషిని రోగాల బారిన పడేలా కూడా చేయగలదు. అందుకే ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం అని నిపుణులు చెబుతూనే ఉంటారు. సాధారణంగా అయితే ప్రతి రోజు ఏడు గంటల నిద్ర తప్పనిసరి. అయితే 7 గంటల కంటే తక్కువ పడుకున్నా...ఎక్కువ పడుకున్న ఆరోగ్య సమస్యలు తప్పవు, కొన్ని కొన్ని సార్లు 7 గంటల కంటే ఎక్కువ పడుకున్నప్పుడు కూడా నిద్ర సరిపోలేదు అనే సంకేతాలు మన శరీరానికి అందుతూ ఉంటాయి.



మరి మన శరీరానికి నిద్ర సరిపోయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు పరిశోధకులు. మన శరీరానికి నిద్ర సరిపోయింది అని తెలుసుకోవాలంటే... తర్వాత రోజు ఏ సమయంలో కూడా మీకు నిద్ర  పోవాలి అనిపించటం కానీ ఆ  ఆలోచన రావటం కానీ ఉండకూడదు... ఇలా నిద్ర గురించి అసలు ఆలోచనే రాకపోతే ముందురోజు రాత్రి మీకు నిద్ర సరిగా సరిపోయినట్లు అర్థం  అని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది  ఎలాగో 7 గంటలు  పడుకోవాలి కదా  అని ఇష్టం వచ్చిన సమయంలో... పడుకోవటం చేస్తుంటారు.



ఇలాంటి అలవాట్లు కూడా ఆరోగ్యానికి ఎంతగానో చేటు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొంతమంది రాత్రి పడుకుని తెల్లవారుజామునే లేస్తారు... మరికొంతమంది తెల్లవారుఝామున నాలుగింటికి పడుకుని మధ్యాహ్నం లేస్తారు.. ఎలాగో 7 గంటల సమయమే కదా పడుకుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఎంత సమయం నిద్రపోయాము  అనేదానికంటే.. నిద్రలేచిన సమయానికి  సూర్యోదయానికి  ఎంత దూరం ఉంది అన్నది ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. సూర్యోదయానికి ఎంత దూరం అయితే  అన్ని  ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడి పోతాయి అని అంటున్నారు. అందుకే ఇష్టం వచ్చినప్పుడు కాకుండా రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: