మార్చి నెలలో మొదలైన కరోనా వైరస్ తీవ్రత మెల్లి మెల్లిగా పెరుగుతూ బీభత్సం సృష్టిస్తుంది.  కరోనా వైరస్ ఎక్కువగా అమెరికాని నాశనం చేసింది.. ఆ తర్వాత స్థానం బ్రెజిల్ ఇక మూడో స్థానంలో భారత్ చేరింది. అంతకు ముందు రష్యా ఉన్నా గత ఆదివారం ఆ లెక్కలు మారాయి.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,25,000 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5,62,820 మంది ప్రాణాలు కోల్పోగా, కోలుకున్న వారి సంఖ్య 73,61,659 ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

 

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో అమెరికా తరహాలో మహారాష్ట్ర కొనసాగుతుంది. ఇక్కడ వేల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 25వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.  

 

కొన్ని రాష్ట్రాలు వీక్ ఎండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా దేశంలోనే కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్‌ ను విధించబోతున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్డ్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాల దుకాణాలు, మెడికల్ షాపులు, హాస్పిటల్స్, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, పూణెలో ఇప్పటివరకు 34,399 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా మరణాల సంఖ్య 978కి పెరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: