ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభంలో కూడా ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా మటుకు పెళ్లిళ్లు ఎంతో నిరాడంబరంగా తక్కువమంది బంధుమిత్రుల మధ్య... ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడొక వరుడు సరి కొత్తగా ఆలోచించాడు. తన పెళ్లి ఎంత నిరాడంబరంగా జరిగినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని సరికొత్త ఆలోచన చేశాడు, దీంతో కరోనా  వైరస్ సంక్షోభంలో దృష్టిలో పెట్టుకుని ఏకంగా తన భార్యకు వజ్రాలతో పొదిగిన మాస్కును  తయారు చేయించాడు.



దీని విలువ ఏకంగా లక్ష రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇలా పెళ్లి లో మొదటిసారి వజ్రాలతో తయారుచేసిన మాస్క్  సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవడంతో ఈ మాస్కులకు  డిమాండ్ భారీగా పెరిగిపోయిందట. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ లో చోటుచేసుకుంది. వజ్రాలతో కూడిన మాస్క్ లకు డిమాండ్ ఎంతగానో పెరిగిపోయిందని ఈ నేపథ్యంలో మరిన్ని విభిన్నమైన డిజైన్లతో మాస్క్ లు  తయారు చేసేందుకు సిద్ధమైనట్లు ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సి  చెప్పుకొచ్చారు.వజ్రాలతో  తయారు చేసిన మాస్కులు  వివిధ ధరల్లో తమ వద్ద  అందుబాటులో ఉన్నాయని తెలిపారు.



 నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడితే బంగారు మేళవింపుతో వజ్రాల పొదుగుతో మాస్క్ లను అందిస్తామంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి కూడా ఓ మాస్క్  కొనుగోలు చేశాడని... ఆ మాస్క్  ధర ఏకంగా 2.89 లక్షల రూపాయల విలువ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఆభరణాల వ్యాపారి. ఏదేమైనా ఈ కొత్తరకం మాస్క్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన ఎంతోమంది మాస్క్  ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో.. రోజు రోజుకి ఈ మాస్క్ లకు ఎంతగానో డిమాండ్ పెరుగుతుందని వజ్రాల వ్యాపారి చెప్పుకొచ్చారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: