తాజాగా వైయస్ విజయమ్మ రచించిన ''నాలో నాతో వైఎస్సార్‌ '' పుస్తకం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పుస్తకం పిడిఎఫ్ నెట్లో హల్ చల్ అవుతోంది.  షికార్లు కొడుతూ ఈ పుస్తకం పిడిఎఫ్ ఫైల్ సామాజిక మాధ్యమం లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫైల్ నకిలీది అని తెలియ జేశారు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ భార్య వైయస్ విజయమ్మ స్వయంగా నాలో నాతో వైఎస్సార్‌  పుస్తకం ప్రచురించారు.

 

అయితే ఈ పుస్తకం పేరుతో నకిలీ పిడిఎఫ్ ని సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి ఈ పిడిఎఫ్ కి ఎటువంటి సంబంధం లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. అయితే ఎమెస్కో పబ్లికేషన్స్ అచ్చు వేసిన పుస్తకం అసలైన పుస్తకం అని ఆయన స్పష్టం చేసారు.

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి  71 వ జయంతి సందర్భంగా ఈనెల ఎనిమిదో తేదీన విజయమ్మ రాసిన పుస్తకం విడుదలయింది. ఈ పుస్తకాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా  విడుదల చేశారు. ఈ పుస్తక విశేషం ఏమిటంటే 30 ఏళ్ల పాటు విజయమ్మ వైఎస్ జీవిత సారాన్ని ఇందులో చూపించడం జరిగింది.

 

అయితే మహానేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గురించి లోకం ఏమనుకుంటుంది అనేది ప్రజల నుంచి తెలుసుకుని అలానే ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలపడానికి ఈ పుస్తకాన్ని రచించారు విజయమ్మ. అంతే కాకుండా వైఎస్ఆర్ ఒక తండ్రిగా భర్తగా ఎలా ఉండేవారు అని  కూడా ఈ పుస్తకంలో చూపించారు. వేరే పాత్రలో వైఎస్సార్‌ ఎలా ఉండేవారు. అలానే ఆయన అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు అని విజయమ్మ వివరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: