శాసనమండలిలో రెండోసారి మూడు రాజధానులు, సి.ఆర్.డి.ఎ బిల్లులు ప్రవేశపెట్టడంతో  ఆటోమేటిక్ గా చట్ట రూపం పొందే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఎలాగైనా ఈ బిల్లును అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ గున‌పాటి దీప‌క్‌రెడ్డి ఈ రెండు బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మళ్లీ ప్రవేశపెట్టడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో శాసనసభలో జగన్ సర్కార్ రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించు కోవటం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పెద్దల సభ శాసనమండలిలో ఈ బిల్లులు మండలి చైర్మన్ సెలెక్ట్ క‌మిటీ ప‌రిశీల‌న‌కు సిఫార్సు చేసి స‌భ‌ను వాయిదా వేశార‌ని, అయితే శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి బాలకృష్ణ‌మాచార్యులు చైర్మ‌న్ ఆదేశాల‌ను పాటించ‌లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ సెలెక్ట్ క‌మిటీని ఏర్పాటు చేయ‌లేద‌ని తెలిపారు.

 

అంతేకాకుండా గత నెల 16 వ తారీఖున ఈ రెండు బిల్లులను మళ్లీ శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవడం జరిగింది. ఈ తరుణంలో సెలెక్ట్ కమిటీకి పంపగా మళ్లీ శాసన మండలి లో ఎలా ఆమోదిస్తారని దీపక్ రెడ్డి తన పిటిషన్ లో ప్రశ్నించారు. అయితే ఈ పిటిషన్ పట్టుకుని హైకోర్టును ఆశ్రయించగా కరోనా కారణంగా అత్యవసర కేసుల్లో తప్ప మిగతావి చూడటం లేదని హైకోర్టు ఈ పిటిషన్ ను పక్కన పెట్టడం జరిగింది. దీంతో వెంటనే ఇప్పుడు దీపక్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటీషన్ ను పక్కన పెట్టడం తో సుప్రీంకోర్టు కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు.

 

మొత్తం మీద చూస్తే 3 రాజధానుల నిర్ణయం కి చట్టబద్ధత ఈనెల 14వ తేదీన ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని చెప్పబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తారీఖు జగన్ సర్కార్ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా చాలా సరి కొత్త నిర్ణయాలు ఈ భేటీలో జరగనున్నట్లు ఇది పాలనా పరంగా అందరికి వెరీ వెరీ స్పెషల్ బేటీ అని అంటున్నారు. ఇది ఈనెల 15వ తారీఖున జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో దాదాపు పరిపాలన మొత్తం విశాఖ పట్టణానికి వైఎస్ జగన్ తరలించడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: