సాధారణంగా నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు.. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా.. ఆ భగవంతుడి సన్నిధిలో శిక్ష తప్పించుకోరని అంటుంటారు.  కొన్ని సార్లు ఎప్పుడో చేసిన నేరాలు అనుకోకుండా బయట పడటం.. శిక్ష పడటం చూస్తుంటాం. ఇలాంటి విచిత్రాలు సినిమాల్లోనే చూస్తుంటాం.. ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇలాంటి నేరగాళ్లు బయటపడటం చూస్తున్నాం. తాజాగా 38 సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో రూ.1.32 లక్షలు దోచుకుని గుట్టుగా జీవితం గడుపుతున్న ఓ గజదొంగను గుజరాత్ పోలీసులు పట్టుకొన్నారు.  ఇప్పుడు దర్జాగా కూర్చున్న చోటనే సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ ఒకప్పుడు దారిదోపిడి చేస్తూ గజదొంగలు హల్ చల్ చేసేవారు.  అప్పట్లో గజదొంగలు అంటే గుండెల్లె వణుకు పుట్టేది.. గ్రామాలు గ్రామాలే కొల్లగొట్టుకొని దోచుకు వెళ్లేవారు. 

 

38 సంవత్సరాల క్రితం గజదొంగ గంగన్న ఒక బ్యాంకులో రూ.1.32 లక్షలు దోచుకుని వెళ్లాడు.. ఆ సమయంలో  ఒక పోలీసును కూడా చంపాడు. ఇన్నేండ్లుగా పోలీసుల కంట పడకుండా జీవితం గడుపుతున్న దొంగ గుట్టు రట్టయింది. దాంతో గజదొంగ  రాజస్థాన్ లో అరెస్టు చేసి గుజరాత్ తీసుకువస్తున్నారు. ఇప్పుడీ దొంగ వయసు 68.  
గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలోని అమిర్ ఘర్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1982 డిసెంబర్ 30 వ తేదీన కొందరు దొంగలు దోచుకొన్నారు.  

 

ఆ సమయంలో బ్యాంకు మేనేజర్పై దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ శివదత్ శర్మను చంపేశారు. అక్కడ నుంచి రూ.1.32 లక్షలు దోచుకుని వెళ్లిపోయాడు. ఇప్పడి డబ్బుతో పోల్చుకుంటే.. అప్పట్లో రూ.1.32 లక్షలు పెద్ద దోపిడే అని చెప్పొచ్చు.  ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులను దోపిడీ జరిగిన కొద్ది రోజులకే అరెస్టు చేయగా, గ్యాంగులోని మరో నలుగురు మరణించారు. ముఠాలోని దీప్ సింగ్ రాజ్‌పుత్ ఒక్కడే జీవించి ఉన్నాడు. పాలన్‌పూర్‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం రాజస్థాన్‌లోని బార్మెర్‌కు వెళ్లి 68 ఏళ్ల దీప్ సింగ్ రాజ్‌పుత్‌ను అరెస్టు చేసింది. తదుపరి విచారణ నిమిత్తం దీప్ సింగ్ ను గుజరాత్ తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: